ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఎన్డీయే భాగస్వామిగా కూటమి తరఫున సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం సహద్రలో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఎపి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు , ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, ఎంపి బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ ఎంపి సానా సతీష్ , ఎంపి బాలశౌరి, ఎంపి ఉదయ్ శ్రీనివాస్, ఎం.పి. శ్రీ భరత్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపి దగ్గుమళ్ల ప్రసాద్ రావు,ఎంపి బైరెడ్డి శబరిలతో పాటు ఎంపి కేశినేని శివనాథ్ కూడా పాల్గొన్నారు.
