Breaking News

Daily Archives: September 13, 2024

అధికారుల సమన్వయం తో దసరా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయండి…

-కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 3 వ తేదీ నుండి నిర్వహించనున్న దసరా శరనవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి యిబ్బందులు కలగకుండా అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. సృజన సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలను అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈ ఓకే ఎస్ రామారావు తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం …

Read More »

ఆప్షన్-3 ఇళ్ళ నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి

-అక్టోబర్ నేలాఖరకు 50 వేల ఇళ్ళు నిర్మించాలి -సమస్యలకు వెంటనే పరిష్కారం -సమీక్షా సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధ సారధి ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆప్షన్-3 ఇళ్ళ నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్రగృహనిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధసారధి ఆప్షన్-3 కాంట్రాక్టర్లను ఆదేశించారు.నాణ్యత పై సమగ్రమైన విచారణ జరిపిస్తున్నామని, లోపాలు ఉంటె సంభందిత కాంట్రాక్టర్లుసరిదిద్దుకోవాలని, లోపాలు సరిదిద్దేవరకు నిర్మాణాలకు సంభదించిన చెల్లింపులు జరగవని ఆయన స్పష్టం చేశారు. …

Read More »

వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సిఎం నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సమీక్ష చేశారు. సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమై బాధిత ప్రాంత ప్రజలకు వివిధ ప్రైవేటు సంస్థలు అందించే సేవల విషయంలో ప్రోగ్రెస్ ను రివ్యూ చేశారు. బ్యాంకర్లు, భీమా ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ సంస్థల యాజమాన్యాలు, వారి సర్వీస్ సెంటర్ల ప్రతినిధులతో సమీక్ష చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న …

Read More »

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల

-వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చే పనులకు మరో రూ. 290 కోట్లు -టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలి -ఆర్.ఓ.బీలపూర్తికి భూసేకరణ కోసం నిధుల విడుదల -రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలి -రోడ్లు & భవనాల శాఖ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి …

Read More »

వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-ఎన్యుమరేషన్ పై మంత్రులు, అధికారులతో సిఎం రివ్యూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సిఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి…..ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని…నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని అన్నారు. సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని..పరిహారం …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలు, జరిగిన నష్టాన్ని మీడియాకు వివరించారు. విజయవాడ వరదల వల్ల నగరంలోని 32 వార్డులతోపాటు నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా నష్టం సంభంవించిందని తెలిపారు కలెక్టరేట్ కేంద్రంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది రోజుల పాటు సమీక్షిస్తూ, అధికారులను అలెర్ట్ చేసి, ఆయన కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వరద నష్టం పై మంత్రులు, అధికారులతో …

Read More »

వ‌ర‌ద బాధితుల‌కు ప‌లువురి విరాళం

-ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కుల‌ అంద‌జేత‌ -దాత‌ల‌ను అభినందించిన సీఎం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌దల విప‌త్తుతో స‌ర్వం కోల్పోయి నిరాశ్రయులైన వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డానికి మేముసైతం అంటూ పలువురు దాత‌లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి విరాళాలు అంద‌జేస్తున్నారు. స‌చివాల‌యంలో శుక్రవారం ప‌లువురు దాత‌లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ముఖ్యమంత్రి స‌హాయ నిధికి చెక్కుల‌ను అంద‌జేశారు. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చిన దాత‌ల‌ను సీఎం అభినందించారు. విరాళాలు అంద‌జేసిన‌వారిలో…. 1. భాష్యం పేరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున భాష్యం రామకృష్ణ …

Read More »

మొదటిసారి కృష్ణా జలాలతో నిండిన గండికోట జలాశయం

-ప్రభుత్వ సూచన ప్రకారం కెనాల్ లో పూడికలు , రిజర్వాయర్ డ్యాం గేట్ పనులు పూర్తి చేయడంతో .. కడప,అన్నమయ్య జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు -నిండుకుండలా మారనున్న 150 చెరువులు -ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాము… మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంవత్సరం రాయలసీమలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీని ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతం నుండి భారీ గా శ్రీశైలం రిజర్వాయర్ నుండి ప్రవాహం వచ్చినందున వల్లనా 200 కిలోమీటర్ల …

Read More »

వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తో కలిసి విజయవాడలోని సింగ్ నగర్ లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలు అయిన పలు డివిజన్లలోని సుమారు 3,500 కుటుంబాలకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుమారుడు విఘ్నేశ్ రెడ్డి బాధితుల కోసం పంపిన నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ … చరిత్రలో ఎన్నడూ లేని విధంగా …

Read More »

ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను వేగవంతంగా అమలుచేయండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్ధికేతర మరియు స్వల్ప కాలంలో పరిష్కరించ గలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయాశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య,ఆరోగ్య, హోం, జిఏడి, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ, ప్రణాళిక, ఎక్సైజ్, జల వనరులు, మైన్స్ అండ్ జియాలజీ, ఇంధన, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, …

Read More »