Breaking News

వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలు, జరిగిన నష్టాన్ని మీడియాకు వివరించారు. విజయవాడ వరదల వల్ల నగరంలోని 32 వార్డులతోపాటు నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా నష్టం సంభంవించిందని తెలిపారు కలెక్టరేట్ కేంద్రంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది రోజుల పాటు సమీక్షిస్తూ, అధికారులను అలెర్ట్ చేసి, ఆయన కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వరద నష్టం పై మంత్రులు, అధికారులతో సబ్ కమిటీ కూడా వేశారని, ఆకమిటీ కూడా సమీకిస్తుందన్నారు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ రేపటికల్లా పూర్తి అవుతుంది. వరదల వల్ల ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా మంది ఇళ్లల్లో ఫర్నిచర్ దెబ్బతింది .. బెడ్స్ పిల్లొలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ 61, 63, 64 వార్డుల్లోని 10 వీధులు, 1500 ఇళ్లు నీట మునిగి ఉన్నాయన్నారు. నాలుగు చక్రాల వాహనాలు , టూ వీలర్లూ, బాగా దెబ్బతిన్నాయి. ప్రతి ఇంటిలో వరద నష్టం అంచనా వేసాము.

నష్టం అంచనా లో కొంతమంది ఇళ్లల్లో లేరు. దెబ్బతిన్న ఇళ్ళు నీళ్లలో ఉండిపోయిన ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి. 53, 399 ఇళ్ళు నీళ్లలో ఉండిపోయాయి. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 36,923 వీలర్స్, 2 వేలు కార్లు, ఇతర వాహనాలు నీరు చేరటం వల్ల పాడయ్యాయి. దాదాపు 26,545 టీవీ లు, ఫ్రిజ్ లు 31 వేలకు పైగా, వాషింగ్ మెషీన్లు 20 వేలకు పైగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 5 వేల కోట్ల నష్టం వ్యవసాయ రంగానికి జరిగింది. రేపు సాయంత్రానికి వరద నష్టం అంచనా పూర్తి అవుతుంది. ముఖ్యమంత్రి ఎవరికి ఎంత నష్టం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. 17 తేదీ లోపల వరద నష్టం అంచనా పూర్తి అవుతుంది. బ్యాంకర్లు, ఇన్యూరెన్స్ వాళ్లతో ముఖ్యమంత్రి సమీక్షచేశారు, 4,5 రోజుల్లో పూర్తి వివరాలు అందించాలని వారిని కోరారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *