Breaking News

Daily Archives: September 29, 2024

తిరుపతి ప్రభుత్వ బాలికల వసతి గృహము ఆకస్మికంగా సందర్శన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అయిన పద్మావతి మరియు ఆదిలక్ష్మి తిరుపతి ప్రభుత్వ బాలికల వసతి గృహము ను ఆదివారం ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. వసతి గృహమునందు బాలికలకు అందుతున్న సదుపాయాలను మరియు గృహమునందు పిల్లల యొక్క బాగోగులను అడిగి తెలుసుకోవడం జరిగింది. వసతి గృహం సూపర్డెంట్ గారిని పిల్లల చదువు మరియు ఆరోగ్యం వారికి అందుతున్న సదుపాయాలను గురించి తెలుసుకోవడం జరిగింది. అమ్మానాన్న లేని పిల్లలను అడాప్షన్ ప్రాసెస్ నందు పెట్టాలని …

Read More »

శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు. …

Read More »

“ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేసి 28 వ వంసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ట్రస్టు తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పర్యటన లో భాగంగా ఉదయం 10.30 గంటలకి రాజమహేంద్రవరం , ప్రకాష్ నగర్(డోర్ నెంబర్ …

Read More »

పేద ప్రజల బ్యాంక్ ఆర్యపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్

-పేదల పక్షాన నిలవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన -ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ -ఆర్యపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 105వ సాధారణ మహాజన సభ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పేద ప్రజల బ్యాంక్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలోని వీటీ డిగ్రీ కాలేజ్ నందు ఆర్యపురం కో-ఆపరేటివ్ …

Read More »

సెప్టెంబరు 30 సోమవారం “పీజీఆర్ఎస్ ప్రజల అర్జీల పరిష్కార వేదిక ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ సెప్టెంబరు 30 వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. సెప్టెంబరు 30 సోమవారం “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో “మీ కోసం” కార్యక్రమం …

Read More »

శాసన మండలి స్థానాల ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్దేశించేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే : ఎం.డి.జాని పాషా

-ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని పట్టభద్రులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ నమోదు చేసుకోవాలి -గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారికి సచివాలయ ఉద్యోగులు అండగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు :ఎం.డి.జాని పాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా మాట్లాడుతూ, రానున్న 2025వ సంవత్సరంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ …

Read More »

అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట

– దసరా ఉత్సవాల విజయవంతానికి మీడియా సహకారం అవసరం – అధికారులు, మీడియా స‌మ‌న్వ‌యంతో భక్తులకు మెరుగైన సేవలు అందిద్దాం – జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలందించి త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించి ఉత్సవాలు విజయవంతం చేయడంలో మీడియా సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల‌ను …

Read More »

భువనమ్మకు మంత్రి సవిత ధన్యవాదాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికులకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పండగల నేపథ్యంలో చేనేత వస్త్రాలు ధరించాలని, నేతన్న కళాకారులకు అండగా నిలవాలని నారా భువనేశ్వరి పిలుపునివ్వడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల కష్టాలను నారా …

Read More »

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన)చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ లోని పారిశుధ్య కార్మికులకు ఎన్డీఏ కూటమి నేతలు నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్ , జిప్పర్స్ కంపెనీ అధినేతలు గణేష్, శ్రీను బాబు తదితరులు ఆదివారం భవానీ పురం ఎన్డీఏ కార్యలయం లో బట్టలు ,చెప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు విశేషంగా కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికుల …

Read More »

కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నరని, …

Read More »