Breaking News

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన)చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ లోని పారిశుధ్య కార్మికులకు ఎన్డీఏ కూటమి నేతలు నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్ , జిప్పర్స్ కంపెనీ అధినేతలు గణేష్, శ్రీను బాబు తదితరులు ఆదివారం భవానీ పురం ఎన్డీఏ కార్యలయం లో బట్టలు ,చెప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు విశేషంగా కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సుజనా ఫౌండేషన్ మరియు జిప్పర్స్ కంపెనీల సహకారంతో పశ్చిమ లోని 995 మంది పారిశుధ్య కార్మికులకు బట్టలు, చెప్పులతో కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వరద ముంపు ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారని విధి నిర్వహణలో భాగంగా వారు అందించిన సేవలు వెలకట్టలేని వన్నారు. విపత్తు సమయంలో బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు సాయం అందించాల్సిన అత్యవసర పరిస్థితుల్లో వైసిపి నాయకులు సహాయ నిరాకరణ చేయడం దురదృష్టకరమన్నారు. వరద బాధితులకు సుజనా ఫౌండేషన్, కూటమినేతలు ఐక్యంగా ఉండి అండగా నిలబడ్డామని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు. నాగుల్ మీరా మాట్లాడుతూ విపత్తులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున సేవలను అందిస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు వరదలతో నష్టపోయిన అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు అండగా నిలబడ్డామన్నారు. బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పైలా సోమినాయుడు, గుడివాడ నరేంద్ర రాఘవ, బుల్లా విజయ్, యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, మల్లెపు విజయలక్ష్మి, రౌతు రమ్యప్రియ, జిప్పర్స్ కంపెనీ అధినేతలు గణేష్, శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *