-శాసనసభ్యులు సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడాది జరగనున్న దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ సీవి రాజశేఖర్, దేవాదాయ శాఖ కమిషనర్ …
Read More »Daily Archives: September 29, 2024
హైదరాబాద్ నగరం.. భిన్న సంస్కృతులకు నిలయం
-ఓనం వేడుకల్లో తెలంగాణ మంత్రి సీతక్క హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ నగరం ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటుందని, అందుకే వివిధ రాష్ర్టాలకు, ప్రాంతాలకు చెందినవారు ఇక్కడికి రావడానికి ఇష్టపడటమే కాకుండా వారి సొంత ప్రాంతంగా భావిస్తారని మంత్రి సీతక్క అన్నారు. శేరిలింగంపల్లి, నల్లగండ్ల మళయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఓనం వేడుకలను నిర్వహించారు. 20 గెటెడ్ కమ్యూనిటీలకు చెందిన దాదాపు 800లకుపైగా ఉన్న మళయాలీ కుటుంబాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి నల్లగండ్లలోని ఎపిస్టెమో స్కూల్‌లో నిర్వహించిన వేడుకలో పాల్గొన్నారు. …
Read More »పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దాం..నేతన్నలను ఆదరిద్దాం: హోంమంత్రి వంగలపూడి అనిత
-నారా భువనమ్మ పిలుపు మేరకు చేనేతలకు అండగా నిలబడదాం : హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరిద్దామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి..రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రాబోయే …
Read More »మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
-జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : గోరంట్ల మండలం గంగంపల్లి మజరా దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం పిడుగుపాటుకు ఒకే కుటుంబం లో ఇద్దరు మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, గోరంట్ల తాసిల్దార్ మారుతి, సీఐ శేఖర్,. పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్త వాలపై నివేదికను అందజేయాలని ఆదేశించారు. అలాగే సంఘటనలో గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స నిమిత్తం తీసుకెళ్లవలసిందిగా జిల్లా …
Read More »ఈ నెల 30వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ
-జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ డా. జి. సృజన అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని, దీనిలో భాగంగా కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల …
Read More »సోమవారం జిఎంసి లో మీకోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 30వ తేది సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుండి మ.1 గం.వరకు నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబిసి) సర్జరీలు చేసేలా చర్యలు తీసుకోవాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ఏబిసి సెంటర్ లో ప్రతి రోజు 100కు తగ్గకుండా వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబిసి) సర్జరీలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన చర్యలు సదరు కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. అదివారం కమిషనర్ ఏటుకూరు రోడ్ లోని ఏబిసి సెంటర్, వర్మి కంపోస్ట్ యూనిట్, వెంగళాయపాలెంలోని గోశాలలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ …
Read More »భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ గారు తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేటి ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణమైన భారత సిజెఐ గారికి సాదర వీడ్కోలు లభించింది. జస్టిస్ పి.కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ చిత్తూరు జిల్లా, జస్టిస్ వై. లక్ష్మణరావు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జస్టిస్ రాఘవ స్వామి రిజిస్ట్రార్ ప్రోటోకాల్ …
Read More »బధిరుల సంక్షేమానికి కృషి చేస్తాం : విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బధిరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తిరుపతిలోని స్థానిక రాస్ భవనం నందు అంతర్జాతీయ బధిరుల సంజ్ఞల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సౌoజ్ఞల దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. బదిరుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. పింఛన్ల పంపిణీ, వినికిడి …
Read More »జిల్లాలో 2,66,342 మందికి సుమారు రూ.112.71 కోట్లు అక్టోబర్ 1 న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ నెల NTR భరోసా పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ ల పంపిణీ జిల్లాలో 2,66,342 మందికి సుమారు రూ.112.71 కోట్లు పంపిణీ చేయనున్నట్లు, అక్టోబర్ 1వ మరియు 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం వృద్దాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, …
Read More »
Prajavartha Online Telugu News