తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బధిరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తిరుపతిలోని స్థానిక రాస్ భవనం నందు అంతర్జాతీయ బధిరుల సంజ్ఞల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సౌoజ్ఞల దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. బదిరుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. పింఛన్ల పంపిణీ, వినికిడి యంత్రాలు, చదువుకొనే విద్యార్థులకు టచ్ ఫోను, లాప్టాప్, హియర్ అండ్ స్పీచ్ థెరఫీ, స్వయం ఉపాధి కొరకు రుణాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలువురు బదిరులు ఇచ్చిన డిమాండ్లను తమ పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తామని, మరికొన్ని అంశాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్నికి నివేదించి పరిష్కరించేలా చూస్తామన్నారు. అనంతరం కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పర్యవేక్షకులు బి.వినోద్ ఆధ్వర్యంలో మనోజ్ కుమార్ ప్రెసిడెంట్ తిరుపతి జిల్లా బదిరుల సంఘం, వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చక్రవర్తి, జనరల్ సెక్రెటరీ రెడ్డెప్ప రెడ్డి, ట్రెజరర్ సుబ్బారాయుడు, మాధవ్, అధ్యక్షులు తిరుపతి జిల్లా విభిన్న ప్రతిబావంతుల సంగం, సి. యువరాజ్, డైరెక్టర్, రాస్ సంస్థమరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News