Breaking News

శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీధర్, డెప్యూటీ ఈవోలు లోకనాథం, శ్రీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *