విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ మాస్టర్ మైండ్ స్కూల్ నందు,SBI CARD మరియు రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారంతో ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలోని 1500 వందల మంది వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి వరద బాధితులకు సరుకుల ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఇటువంటి కష్ట సమయాల్లో వరద బాధితులకు …
Read More »Daily Archives: October 6, 2024
అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై వుండాలి : ఎంపి కేశినేని శివనాథ్
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రజలందరూ ఆ అమ్మవారి అనుగ్రహం, కరుణాకటాక్షల తో సుభిక్షంగా వుండాలని ఎంపి కేశినేని శివనాథ్ కోరుకున్నారు. తిరువూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్ సెంటర్ నందు దసరా శరన్నవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందుకున్నారు. మండప నిర్వహకులు ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు, …
Read More »మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షన
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సామాన్య భక్తులకు సాఫీగా అమ్మ దర్శన భాగ్యం కల్పించేలా సేవలు అందించాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకొని వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
Read More »జగజ్జనని పాదాల చెంత కళావైభవం
-మనోరంజకంగా సాగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు -వైభవోపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మాతను శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శించుకునేందుకు వస్తున్న భక్తులను ఆధ్యాత్మిక తరంగాలలో విహరింపజేసే కళా ప్రదర్శనలు రంజింప చేస్తున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని కనులారా చూడాలని వస్తున్న భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళా ప్రదర్శనలు తిలకించి భక్తులు మైమరచిపోతున్నారు. ప్రతిరోజు కళావేదికపై నిత్య నూతనమైన స్వర, నృత్య ప్రదర్శనలు ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. నవరాత్రి …
Read More »నిరంతర పర్యవేక్షణతో భక్తజన సంద్రానికి ఏర్పాట్లు
– సౌకర్యాలు పరంగా ఎక్కడ లోటు ఉన్నా వెంటనే గుర్తించి సరిదిద్దుతున్నాం. – సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన ఏర్పాట్లు. – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వైభవంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్త జనసంద్రాన్ని ముందే ఊహించి చేసిన ఏర్పాట్లతో సామాన్య భక్తులకు సంతృప్తికరంగా అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తోంది. జిల్లా కలెక్టర్ సృజన ఆదివారం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ …
Read More »ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-పాలు, మజ్జిగ, మంచినీళ్లు నిరంతరం సరఫరా. -వేగంగా కదులుతున్న క్యూలైన్లు -సీఎం చంద్రబాబు ఆదేశాలతో పటిష్టమైన ఏర్పాట్లు -నిరంతర పర్యవేక్షణలో దేవాదాయశాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, కలెక్టర్ డా. సృజన, ఈవో రామరావు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా దేవి దసరా మహోత్సవాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. నాలుగో రోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు …
Read More »ఆలయ ఈవో కె ఎస్ రామారావు ఆకస్మిక తనిఖీలు
-అనదికార దర్శనాల కట్టడికి చర్యలు -వృద్దులు, వికలాంగుల వసతుల క్షేత్ర స్థాయి పరిశీలన -ఏర్పాట్లపై భక్తులతో అభిప్రాయ సేకరణ -సంతృప్తి వ్యక్తపరచిన భక్తులు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా మహోత్సవములు సందర్బంగా ఇంద్రకీలాద్రి పై జగన్మాత ను దర్శించుకొనుటకు వివిధ ప్రాంతముల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈరోజు అనగా తేదీ 06.10.2024 న 4 వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుండగా ఉదయం 3 గం. ల నుండి భక్తులు విశేషముగా విచ్చేసి అమ్మవారిని …
Read More »విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మరచిపోవద్దు
-పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలి -ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితులు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తాను -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ -క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రివర్యులతో సమావేశమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ సేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమ కోసం అంతమంది చేసిన …
Read More »అగ్గిపెట్టెలకు, కొవ్వోత్తులకు రూ.23 కోట్లు అనేది అసత్య ప్రచారం
-ఆ నిధులు ఖర్చు పెట్టించి మొబైల్ జనరేటర్లకు -కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు -ఇలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు చేశారని సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఒక ప్రకటనలో …
Read More »పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా టూరిజం పాలసీ
-నవంబర్ లో విడుదలకి సన్నాహాలు..ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్న పర్యాటక హిత పాలసీ -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ -పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పన -ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామం -పర్యాటకులను ఆకర్షించేలా టెంపుల్, …
Read More »