Breaking News

Daily Archives: October 6, 2024

శ్రీ వీర‌బాబు స్వామిని ద‌ర్శించుకున్న ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదివారం త‌మ్ముల ప‌ల్లి క‌ళాక్షేత్రం వెనుక శ్రీ వీర‌బాబు స్వామి వారి దేవ‌స్థానానికి విచ్చేశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ కి దేవ‌స్థానం క‌మిటీ స‌భ్యులు పండితుల వేద మంత్రోచ్ఛార‌ణ‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ముందుగా ఎంపి కేశినేని శివ‌నాథ్ శ్రీ వీర‌బాబు స్వామిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ద‌స‌రా న‌వ‌రాత్రుల సంద‌ర్బంగా ఆల‌యం లో నెల‌కొల్పిన అమ్మ‌వారిని శ్రీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి దేవిగా ద‌ర్శించుకుని తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు.దేవ‌స్థాన క‌మిటీ …

Read More »

రాష్ట్రంలో పీజీ వైద్య విద్య కోసం దాదాపుగా పూర్త‌యిన రిజిస్ట్రేష‌న్

-లేటు ఫీజు అవ‌స‌రం లేద‌న్న వైద్య విశ్వ‌విద్యాల‌యం -వైద్య విద్యార్థుల ప్ర‌యోజ‌నం కోస‌మే చేప‌ట్టిన ప్ర‌క్రియ‌ ఇది అని స్పష్టం చేసిన వైద్య విశ్వవిద్యాలయం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పీజీ వైద్య విద్య‌ను ఆశిస్తున్న వైద్య విద్యార్థులంద‌రూ దాదాపు పూర్తిగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. డాక్ట‌ర్ ఎన్టీయార్ వైద్య విశ్వ విద్యాల‌యం జారీ చేసిన నోటిఫికేష‌న్ మేర‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ గ‌త నెల 27న మొద‌ల‌య్యింది. నేటి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 8,645 మంది పీజీ వైద్య విద్య‌లో ప్ర‌వేశం కొర‌కు రిజిస్ట్రేష‌న్ …

Read More »

4రోజున అమ్మవారు శ్రీలలితా త్రిపురసందరీదేవి రూపం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై నాల్గవ రోజుకు చేరుకున్న దసరా ఉత్సవాలు. దసరా వేడుకల్లో అమ్మవారు 4రోజున శ్రీలలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ… ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. ఉదయం నాలుగు గంటలకే కిక్కిరిసిన క్యూ లైన్లు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ …

Read More »

మద్యం షాపుల లాటరీ ప్రక్రియలో అధీకృత వ్యక్తులకు అనుమతి

-రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన మద్యం పాలసీ 2024-26ను అనుసరించి మద్యం షాపుల ఎంపిక కోసం నిర్వహించే లాటరీ ప్రక్రియలో పాల్గొనవలసిన వ్యక్తి తన తరుపున ఇతరులకు అధీకృత అనుమతిని ఇవ్వవచ్చని రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. ఒక వ్యక్తి ఒక దుకాణం కోసం దాఖలు చేసే దరఖాస్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని, అదే క్రమంలో ఒక వ్యక్తి నిర్వహించగల దుకాణాల సంఖ్యపై కూడా …

Read More »

ఆ పెళ్లిళ్ల ఖర్చు రూ.6 లక్షల కోట్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని సి ఐ ఏ టి అంచనా వేస్తోంది. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయి.

Read More »