Breaking News

Daily Archives: October 11, 2024

మహిషాసురమర్ధని అలంకృత జగజ్జననిని దర్శించుకున్న శాసనసభ్యులు హరిప్రసాద్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గా శరన్నవరాత్రులు తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి) అలంకృత అమ్మవారిని శాసనమండలి సభ్యులు హరిప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్యూ లైన్లలో కూడా గందరగోళం తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ …

Read More »

మహిషాసుర మర్దని అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు దుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దినిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సతీసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసారు. అనంతరం ఈఓ రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం …

Read More »

మహిషాసురమర్ధని అలంకృత జగజ్జననిని దర్శించుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజున జగన్మాత మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సతీసమేతంగా శుక్రవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, వేద పండితులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం కృష్ణప్రసాద్ దంపతులకు అందించారు.

Read More »

ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు

-రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా వచ్చే ఐదేళ్లలో నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్థేశం చేశారని, ఆ లక్ష్య సాధన దిశగా గృహనిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాలా శాఖ మంత్రి కొలుసు …

Read More »

తిరుపతి జిల్లాకు ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి

-వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, …

Read More »

రాష్ట్ర ప్ర‌భుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి వుంది :ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఘ‌నంగా సింహా కియా షోరూమ్ ను ప్రారంభోత్స‌వం -మంత్రి లోకేష్ కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ -షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లా లో అనేక పెట్టుబడులు తీసుకువ‌చ్చేందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారాలోకేష్ కృషి చేస్తున్నారు. పరిపాలన కేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి వుంది. ఆ దిశ‌గానే ప‌రిపాల‌న సాగుతుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. మంగళగిరి సమీపంలోని …

Read More »

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దుర్గామాత దీవించాలి : ఎం.పి కేశినేని శివ నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం విద్యాధర పురం క్వారీ సెంటర్లో శ్రీ కనకదుర్గమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపం లో మహిషాసుర మర్దిని అవతారం లో దర్శనమిచ్చిన అమ్మవా రిని ఎంపీ కేశినేని శివ నాథ్ శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ కనకదుర్గమ్మ సేవా సమితి నిర్వాహకులు ఏం.పి కేశినేని శివ నాథ్ కి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎంపీ కేశినేని శివ నాథ్ కి పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో సీఎం …

Read More »

రాష్ట్ర ప్రజలందరికీ విజయ దశమి పండుగ శుభాకాంక్షలు… : మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశక్తి ప్రతిరూపమైన దుర్గాదేవిని పూజించి ఆరాధించే విజయదశమి పండుగను భక్తి శ్రద్దలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ అని, నవరాత్రి పండుగ సందర్భంగా, భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని మరియు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా …

Read More »

పామాయిల్ రూ.110కే విక్రయించాలి-రైతు బజార్లను తనిఖీ చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్

-ప్రజలకు విక్రయించే సరకుల నాణ్యత, ధరలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ఆకస్మికంగా రెండు రైతు బజార్లను పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేసారు. శుక్రవారం గురునానక్ కాలనీ సహా, పంటకాలువ రోడ్ లో ఉన్న రైతు బజార్లను మంత్రి  తనిఖీ చేసి  వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై  వినియోగదారుల అడిగి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ లీటరు రూ.110కి, సన్ ఫ్లవర్ ఆయిల్ ను రూ.124కు విక్రయించాలని, అదేవిధంగా అందరికీ కనబడేలా …

Read More »

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు కార్యాలయాన్ని పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని దుర్గం చెరువు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ , హైదరాబాదు మెట్రో వాటర్ ప్రాజెక్ట్ మరియు గార్బెజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బృందం శుక్రువారం పరిశీలించింది. ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న కార్యక్రమాల స్టడీ టూర్ లో భాగంగా శుక్రువారం జిహెచ్ఎంసిలో వివిధ ప్రాజెక్ట్ లను నగర కమిషనర్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కమిషనర్ బృందానికి తొలుత …

Read More »