ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజున జగన్మాత మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సతీసమేతంగా శుక్రవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, వేద పండితులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం కృష్ణప్రసాద్ దంపతులకు అందించారు.
Prajavartha Online Telugu News