Breaking News

రాష్ట్ర ప్ర‌భుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి వుంది :ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఘ‌నంగా సింహా కియా షోరూమ్ ను ప్రారంభోత్స‌వం
-మంత్రి లోకేష్ కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్
-షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లా లో అనేక పెట్టుబడులు తీసుకువ‌చ్చేందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారాలోకేష్ కృషి చేస్తున్నారు. పరిపాలన కేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి వుంది. ఆ దిశ‌గానే ప‌రిపాల‌న సాగుతుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. సింహా కియా కార్ల షోరూమ్ తిన్నామున్న ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కు ఏం.పి కేశినేని శివ నాథ్ స్వాగతం పలికారు. షోరూం ప్రారంభోత్సవం చేసిన అనంతరం మంత్రి నారా లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ మొత్తం తిలకించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల రాష్ట్రం లో బిజినెన్స్ చేయటానికి వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు వ్యాపారస్తులకి అండదండగా ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కియా షో రూమ్ ఎం.డి రావెళ్ళ సతీష్ , మంత్రి కొలుసు పార్థ సారథి ఎమ్మేల్యేలు కామినేని శ్రీనివాస్, యార్లగడ్డ వెంకట్రావు , గద్దె రామ్మోహన్, కియా ఇండియా సౌత్ రీజనల్ మేనేజర్ జాంగో రియూ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *