తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళయింది. నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు ముస్తాబు అవుతోంది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టిన టిటిడి పనుల్లో నిమగ్నమైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులతో కలిసి ఏర్పాట్లను టిటిడి జెఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, …
Read More »Daily Archives: October 19, 2024
ఎలిమెంటరీ స్కూలును సందర్శించిన మంత్రి లోకేష్
-నెహ్రూబజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని సందర్శించిన లోకేష్… కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఎబిసిడి లు, రైమ్స్ వచ్చా అని అడగ్గా… వారు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరాతీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి లోకేష్ …
Read More »సుజన చౌదరి ఔదార్యం
-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 47వ డివిజన్ పరిధిలోని కేఎల్ రావు నగర్ లో ఇటీవల గుండెపోటుతో మరణించిన తాడేపల్లి నారాయణ 42 కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. నిరుపేద అయినటువంటి తాడేపల్లి నారాయణ వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తూ,చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించాడని వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 47వ డివిజన్ జనసేన అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఎమ్మెల్యే సుజన చౌదరి దృష్టికి …
Read More »ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల స్థలం కాపాడటంలో పూర్వ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటా : ఎమ్మెల్యే బోండా ఉమా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రముఖ ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వం కళాశాలకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా చేయటంతో ఆ స్థలాన్ని కాపాడుకోవటం కోసం కళాశాల పూర్వ విద్యార్థులు సాగిస్తున్న పోరాటానికి తాను అండగా ఉంటానని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇటీవల కళాశాలకి చెందిన స్థలం లేదని తమ స్థలమే ఉందని ఆక్రమణదారులు పత్రికాముఖంగా చెప్పటాన్ని పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమా …
Read More »రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం
-అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు…కానీ రూ.లక్ష కోట్లవుతాయని పదేపదే గత పాలకుల అబద్ధాలు. -రాష్ట్రాభివృద్ధి కోసమే విజన్ 2047… 420లకు నా విజన్ అర్థంకాదు -విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం… -కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుతో అభివృద్ధి చేస్తాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -అమరావతిలో రాజధాని పున:నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, అమరావతి …
Read More »చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం
-రాష్ట్ర్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభంపై రాష్ట్ర్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. …
Read More »డ్రోన్ సమ్మిట్ కు చకచకా ఏర్పాట్లు
-పున్నమీ ఘాట్ వద్ద డ్రోన్ షో -ఏర్పాట్లు పరిశీలించిన డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22-23 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండు రోజుల సదస్సు సరిగే మంగళగిరి సీకే కెన్వెన్షన్ లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న పున్నమీ ఘాట్ వద్ద మెగా డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. …
Read More »స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం అమలు
-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన …
Read More »గుడివాడ నియోజకవర్గ గ్రామాల ప్రజలకు రక్షిత నీరు
-ఎమ్మెల్యే కలుషిత తాగునీటి సమస్య చెప్పిన వెంటనే నీటి పరీక్షలు చేయాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖకు పవన్ కళ్యాణ్ ఆదేశం -మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో నీటి పరీక్షలు పూర్తి -నందివాడ మండలంలో రూ.91 లక్షలతో నీటి శుద్ధి పనులకు అనుమతులు… గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పనులకు అంచనాలు రూపకల్పన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాయకుడు ప్రజలు బాధలను మనసుతో వినడం ఒక ఎత్తయితే.. దానికి వెనువెంటనే పరిష్కారాన్ని వెతకడం చిత్తశుద్ధికి నిదర్శనం. ఆ చిత్తశుద్ధితోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ …
Read More »అవినీతిరహిత గ్రామ పాలనకు పెద్ద పీట
-ప్రజలకు సంబంధించిన సమస్యలు వినడానికి నా కార్యాలయ తలుపులు తెరిచే ఉంటాయి -కూటమిలో ఉన్న మనం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి నిలుపుదాం… అందరి నమ్మకాన్ని నిలబెట్టుకొందాం -జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ -పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర పార్టీల నాయకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘లంచం అనే మాట వినపడకుండా, ఎవరి నోట పలకని విధంగా పాలనలో మార్పు తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది …
Read More »