Breaking News

సుజన చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 47వ డివిజన్ పరిధిలోని కేఎల్ రావు నగర్ లో ఇటీవల గుండెపోటుతో మరణించిన తాడేపల్లి నారాయణ 42 కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. నిరుపేద అయినటువంటి తాడేపల్లి నారాయణ వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తూ,చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించాడని వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 47వ డివిజన్ జనసేన అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఎమ్మెల్యే సుజన చౌదరి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సాయం అందజేయాలని ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం వారి కుటుంబానికి రూ పది వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని భార్య దుర్గ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. ఎమ్మెల్యే సుజనాకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *