Breaking News

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల స్థలం కాపాడటంలో పూర్వ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటా : ఎమ్మెల్యే బోండా ఉమా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ప్రముఖ ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వం కళాశాలకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా చేయటంతో ఆ స్థలాన్ని కాపాడుకోవటం కోసం కళాశాల పూర్వ విద్యార్థులు సాగిస్తున్న పోరాటానికి తాను అండగా ఉంటానని విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇటీవల కళాశాలకి చెందిన స్థలం లేదని తమ స్థలమే ఉందని ఆక్రమణదారులు పత్రికాముఖంగా చెప్పటాన్ని పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా కళాశాల స్థలాన్ని కాపాడటంలో పూర్వ విద్యార్థులు, కళాశాల యాజమాన్యం చేసే పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కళాశాల స్థలాన్ని భవిష్యత్తు తరాల అవసరం కోసం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్యేను కలిసి పూర్వ విద్యార్థి సంఘ నాయకులు దోనేపూడి శంకర్‌, వెలగా జోషి, సంఘం అధ్యక్షులు లంక జానయ్య, కార్యదర్శి చిగురుపాటి యుగంధర్‌, ఉపాధ్యక్షులు ఆళ్ల వేణుగోపాలరావు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *