Breaking News

Daily Archives: October 19, 2024

గొర్రెలకు నట్టల ముందు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో గొర్రెలు మరియు మేకల నట్టల నివారణ కార్యక్రమం భాగంగా శనివారం గూడూరు మండలం చిట్టు గూడూరు గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అండ్ సిహెచ్ నరసింహులు పర్యవేక్షణలో గొర్రెలకు నట్టల మందు ఇవ్వబడినది ఈ కార్యక్రమంలో చిట్టి గూడూరు సర్పంచ్ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

మాతృ మరణాల ను నివారించండి – మాతా శిశు సేవలను మెరుగుపరచండి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన మీటింగ్ హాల్ నందు శనివారం జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీ గారి అధ్యక్షతన మాతృ మరణాల పై సమీక్ష నిర్వహించినారు. ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు జరిగిన మూడుమాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించినారు. .ఈ సమావేశంలో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి తో పాటు పర్యవేక్షక సిబ్బంది ఆరోగ్య కార్యకర్త ,ఆశా కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృ మరణాలను …

Read More »

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన జడ్జి కె.వి రామకృష్ణయ్య

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : పామర్రు నియోజకవర్గంలో మొవ్వ గ్రామం నందు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడానికి కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె.వి రామకృష్ణయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉన్నది విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో నిలువ ఉంచిన సరుకుల పట్టిలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు అందించే ఆహార పదార్థాలలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, ప్రభుత్వం …

Read More »

“జాబ్ మేళా”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెడన సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.22.10.2024 మంగళవారం నాడు పెడన లోని ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ …

Read More »

“నూతన తరహా న్యాయ సేవల శిబిరం”

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సమాజంలో యువత మద్యం, మాదక దవ్యాల బారిన పడి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారని, సమాజంలో ఇలాంటి రుగ్మతలు పోవాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి అరుణ సారిక అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి అలవాట్లు తెలుసుకోవాలని, వారి ప్రవర్తన గమనిస్తూ, వారిని గైడ్ చేయాలని ఆమె సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార …

Read More »

సుప్రీం కోర్ట్ యొక్క చారిత్రాత్మక తీర్పు: బాల్యవివాహం పిల్లల హక్కులను హరించి వేస్తుంది; చట్టం అమలు కోసం మార్గదర్శకాలను జారీ చేసింది

-బాల్య వివాహాలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే మైనర్ల స్వేచ్ఛా సంకల్పాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టు పేర్కొంది -బాల్య వివాహ రహిత భారత్’ క్యాంపెయిన్ (చైల్డ్ మేరెజ్ ఫ్రీ ఇండియా)లో సభ్యులుగా ఉన్న NGO SEVA మరియు కార్యకర్త నిర్మల్ గోరానా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది -వాసవ్య మహిళా మండలి కృతజ్ఞతలు తెలియజేస్తుంది మరియు 2030 నాటికి భారతదేశం బాల్య వివాహ రహితంగా మారుతుందని తీర్పు నిర్ధారిస్తుంది -చైల్డ్ మేరెజ్ ఫ్రీ ఇండియాలో 200 పైగా NGOలు పని చేస్తున్నాయి 2023-24లోనే …

Read More »

విద్యుత్‌ చార్జీలు పెంచితే ఉద్యమం తప్పదు

-నవంబరు 18న సచివాయాల వద్ద ఇళ్ల లబ్దిదారులతో సామాహిక అర్జీలు సమర్పణ. -ఉచిత ఇసుక విఫలం కావటానికి ఎమ్మెల్యేలే కారణం -రాష్ట్రంలో అవినీతి పెరిగింది -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలకు భిన్నంగా కార్యాచరణ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. స్థానిక దాసరి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా తాము …

Read More »

డ్రోన్ సమ్మిట్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అక్టోబర్ 22,2024 న పునమిఘాట్, బబ్బురి గ్రౌండ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న డ్రోన్ సమ్మట్లో జరగబోవు డ్రోన్ షో ఏర్పాట్లను పరిశీలించారు. కృష్ణానది తీరంలో డ్రోన్ షో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని, ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. ఘట్ల వద్ద ఉన్న రైలింగ్ లను సరి చూసుకోవాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు, మొక్కలు నాటే …

Read More »

కృష్ణానది పరివాహిక ప్రాంత ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించండి

-వరద సంబంధిత ఫిర్యాదుల కొరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ 24×7 అందుబాటులో ఉంచండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద హెచ్చరికల కారణంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రజలు తమ ఫిర్యాదులను అంద చేయవచ్చని, లోతట్టు ప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »