Breaking News

Monthly Archives: October 2024

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ రాత్రుల్లో ముఖ్యమైన మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశ్వీరచన మండపంలో మంత్రి సవితకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మంత్రి సవిత… భక్తులతో ముచ్చటించారు. సదుపాయాలు బాగున్నాయని, తాగునీరు, మజ్జిగ అందచేస్తున్నారని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. ఈ …

Read More »

పంట రుణాలు రెండు సంవత్సరాల వరకు రీ షెడ్యూల్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులు వారు తీసుకున్న పంట రుణాలు రెండు సంవత్సరాల వరకు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లింపు మారిటోరియం (తాత్కాలిక నిషేధం)తో కలిపి రెండు సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ఈ విధంగా చేసుకుంటే రైతుల నుండి …

Read More »

పంచాయతీరాజ్ వ్యవస్థను పునరుద్ధరణ (రివైవల్) చేయాలి

-గ్రామపంచాయతీల్లో నూరు శాతం పన్నుల వసూళ్లు చేయాలి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీ రాజ్ వ్యవస్థను పునరుద్ధరణ ( రివైవల్) చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం PR ONE – Visible assets అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా …

Read More »

పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కౌంటర్లు 

మచిలీపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్నధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ప్రత్యేక కౌంటర్ల ద్వారాతక్కువ ధరకు అందిస్తున్న కందిపప్పు, బియ్యం విక్రయాలతో పాటు అదనముగా ఈరోజు నుంచి వంట నూనెలు అనగా సన్ ఫ్లవర్ నూనె మరియు పామొలిన్ నూనెలను మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు అనగా సన్ ఫ్లవర్ నూనెను లీటర్ పాకెట్ ను రూ. 124/- చొప్పున,పామొలిన్ నూనెను లీటర్ పాకెట్ ను రూ. 114/- మరియు టొమాటో కేజీ ఒక్కింటికి రూ. 50/- …

Read More »

జాతీయ స్థాయి లో పథకాలు సాధించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో పథకాలు సాదించిన బాల బాలికలను అభినందిస్తూ జాతీయ స్థాయిలో పథకాలు సాధించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా,నన్ను లో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో విజేతలైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి …

Read More »

మంత్రి నారా లోకేశ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గం లోని పలు సమస్యలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై మంత్రి …

Read More »

ప్రశాంతం గా ముగిసిన ఏడవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఆరవ రోజు అనగా 09/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 28842 మందికి గాను 25853 మంది అభ్యర్థులు అనగా 89.63 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 61 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 14417మందికి గాను 13047మంది అనగా 90. 5 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 61 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ …

Read More »

అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు

-అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న వర్గాల నుండి అందిన వినతుల మేరకు మద్యం షాపుల కోసం నిర్దేశించిన దరఖాస్తుల సమర్పణ గడువును అక్టోబరు 11 వరకు పొడిగించినట్లు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అన్ లైన్ తో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబరు 12,13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల …

Read More »

తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ రావు, బీదా మస్తాన్ రావు

-టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటరమణ, మస్తాన్ రావుకు పార్టీ కండువాలు కప్పి చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Read More »

గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం రైతులను అవమానించింది… : మంత్రి నాదెండ్ల మనోహర్

-పండుగ వాతవరణంలో ధాన్యం అమ్మకాలు -గతంలో రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం… -రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతులను మోసం చేసింది -రైతులు అండగా కూటమి ప్రభుత్వం -కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులు పడుతున్న కష్టాలను తమ పర్యటన సందర్భంలో తెలియ చేయడం జరిగిందన్నారు. రైతులకి అండగా, భరోసా నిలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు అండగా ఉండాలన్నది కూటమి ప్రభుత్వం …

Read More »