మచిలీపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త :
పెరుగుతున్నధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ప్రత్యేక కౌంటర్ల ద్వారాతక్కువ ధరకు అందిస్తున్న కందిపప్పు, బియ్యం విక్రయాలతో పాటు అదనముగా ఈరోజు నుంచి వంట నూనెలు అనగా సన్ ఫ్లవర్ నూనె మరియు పామొలిన్ నూనెలను మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు అనగా సన్ ఫ్లవర్ నూనెను లీటర్ పాకెట్ ను రూ. 124/- చొప్పున,పామొలిన్ నూనెను లీటర్ పాకెట్ ను రూ. 114/- మరియు టొమాటో కేజీ ఒక్కింటికి రూ. 50/- చొప్పున వినియోగదారులకు సరఫరా చేయడం ప్రారంభించబడినది. కావున వినియోగదారులు కందిపప్పు, బియ్యము, వంటనూనెలు మరియు టొమాటో లను నిర్ధేశించిన తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఈ అవకాశసన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరడమైనది.
Prajavartha Online Telugu News