విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ సినీ రాజకీయ విమర్శకులు అభ్యుదయ వాది కత్తి మహేష్ సంస్మరణ సభ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సామాజిక సాధికారత కమిటీ అధ్యక్షుడు కాండ్రు సుధాకర్ బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ వేదిక అధ్యక్షుడు మాదిగాని గురునాధం మాట్లాడుతూ కత్తి మహేష్ ఒక ప్రశ్నించే గొంతు అనీ సమాజానికి ఆయన మృతి తీరని లోటుఅని ఆయన పేర్కొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్ సమాజానికి ప్రశ్నించటం ఎలాగో చేసి ఆచరణలోచూపారని, రాజకీయాల్లోని అల్లరి చిల్లర తనాన్ని లోపాలను ఎత్తిచూపి ఎదురొడ్డి నిలిచారన్నారు, దానిని జీర్ణించుకోలేని వారు ఆయన్ని వ్యతిరేకిస్తూ వచ్చారన్నారు. ఎమ్మార్పీఎస్ ఎస్ జాతీయ అధ్యక్షులు తెన్నేటి కిషోర్ మాదిగ మాట్లాడుతూ కత్తి మహేష్ మృతిపై విచారణ జరపాలని ఆయన మృతిపై అనేకమైన అనుమానాలు ఉన్నాయన్నారు. ఎమ్ఇఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరత్నం కత్తి మహేష్ విశిష్ట లక్షణాల పై కవితా గానం చేశారు. ఈ కార్యక్రమంలో , వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉమ్మడి ధనరాజ్, కృష్ణా జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద నాగమల్లేశ్వరరావు, మహిళా నాయకురాలు లంకా బుజ్జి, దళిత నాయకులు పెరిశపోగు రాజేష్, అనపర్తి గుప్తా, మట్టా ప్రభాత్ కుమార్, మండూరి కిషోర్ బాబు, చిట్టిబాబు,యేసు రత్నం, దేవరపల్లి విజయ వర్మ తదితరులు దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వికసిత్ భారత్ -2047 దిశగా జిల్లాలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి కృషి చేయాలి
-జిల్లాలో పశుగణన ప్రక్రియ ను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక …