Breaking News

అర్హులందరికీ పింఛన్లు… : మంత్రి కొల్లు రవీంద్ర

శారదనగర్(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన మచిలీపట్నం నగరం 31వ డివిజన్ శారదానగర్ లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. వీరవల్లి బసవ నాగేంద్రమ్మ, అనిశెట్టి శేషగిరిరావు, గంజల శశిరేఖకు వృద్ధాప్య పింఛన్లు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్ గంగపుత్రుని వినయ్ కుమార్ కు నూతనంగా మంజూరైన రూ.10వేలు పింఛను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు తొలిగా రూ.35తో పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. తర్వాతి కాలంలో రూ.75, రూ.200 పెరిగాయని, అయితే 2014-19 టిడిపి ప్రభుత్వ హయాంలో ఒకేసారి రూ.2 వేలు పెద్ద మొత్తంలో పింఛను పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దశల వారీగా మాత్రమే రూ.3వేలు ఇచ్చిందన్నారు.

వృద్ధాప్య, వితంతువులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, డయాలసిస్ పేషంట్లకు రూ.10వేలు, కదలలేని పరిస్థితుల్లో ఉండి పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15వేల పింఛన్లను అందించి వారిని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని అన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంతగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పెద్ద మొత్తంలో పింఛన్లను అందిస్తోందని, రాష్ట్రంలో 64 లక్షల మంది పింఛనుదారులకు సంవత్సరానికి సరాసరి రూ.33 వేల కోట్లకు పైగా ఇందుకోసం వెచ్చిస్తోందని మంత్రి తెలిపారు. ఈ రీతిగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలుపుతూ త్వరలోనే ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు.

మచిలీపట్నం నియోజకవర్గం మొత్తం మీద ప్రస్తుతం కొత్తగా 24 పింఛన్లు మంజూరు కాగా, వాటిలో పట్టణంలో 12, గ్రామాల్లో 12 పింఛన్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. 31వ డివిజన్ పార్టీ ఇన్చార్జి అనల నాగులు, 30వ డివిజన్ ఇంచార్జ్ పిప్పల్ల వెంకన్న, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మాజీ జెడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, కూటమి నాయకులు తలారి సోమశేఖర్, ఇలియాస్ పాషా, లంకేష్ శేషగిరిరావు, మాదివాడ రాము తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *