విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ఆక్యుపంక్చర్ హబ్ గా అభివృద్ధి చేసి భారతదేశంలోనే మొట్టమొదటి కేంద్రంగా వుండేలాగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి విన్నపాన్ని అందించనున్నట్లు ఎస్పా భారత్ (ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోషియేషన్ ఆప్ భారత్) వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి డా.మాకాల సత్యనారాయణ కోరుతున్నామని తెలిపారు. ఇలా చేస్తే భారత సాంప్రదాయ వైద్యం మరింత ప్రజలకు అందుబాటులోనికి వస్తుందని తెలిపారు. మందులు అవసరం లేని, ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ లేని ఈ వైద్యం మూలాలు భారతీయ యోగ లో ఉన్నాయని.యోగ విధానానికి ఆధునిక సైన్స్ జతచేసి త్వరితగతిని ఉపశమనము, నయంకావడం మరియు నివారణ సాధ్యమని అనేక సర్జరీలను సైతం లేకుండానే తగ్గించ వచ్చునని డా. మాకాల తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలిసి త్వరగా అభివృద్దికి చర్యలు చేపట్టవలసినదిగా కోరడమైనది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆప్ హెల్త్ ఎమ్.టి కృష్ణబాబు, పెనమలూరు ఎమ్.ఎల్.ఎ బోడె ప్రసాద్ ల మద్దతు కూడ గట్టడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బుద్ధులు ఆక్యుపంక్చర్ ను అభివృద్ధి పరిచారని వాళ్ళ జ్ఞాపకార్థం అమరావతిని ఆక్యుపంక్చర్ కేంద్రంగా చేయడం సముచితంగా వుంటుందని డా.మాకాల సత్యనారాయణ తెలిపారు. భారత ప్రభుత్వం ఆక్యుపంక్చర్ ను ప్రత్యేగ విభాగ చికిత్సగా గుర్తింపు ఇచ్చిన అంశం అందరికి తెలిసిందే.. విజన్ 2047 నాటికి ఆరోగ్య బడ్జెట్, గణనీయంగా తగ్గుతుందని, ప్రజల ఆరోగ్యం మెరుగు పడి ఆనందంగా వుండటానికి మరియు ఆయుష్షు పెరగడానికి అమరాపతి ఆక్యుపంక్చర్ హబ్ దోహదం చేయగలదని డా.మాకాల సత్యనారాయణ తెలిపారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …