విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్.జగన్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాపునేస్తం పథకం అమలు వర్చువల్ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …