-ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని 30 నుంచి 45 శాతం వరకు డిస్కౌంట్
-బి హరి ప్రసాద రావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉగాది మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సరి కొత్త వస్త్రాలపై 30% డిస్కౌంట్ మరియు ఎంపిక చేసిన చేనేత వస్త్రాలపై 45% డిస్కౌంట్ ను ఇస్తున్నట్లు ఆప్కో రాజమండ్రి మండల వాణిజ్య అధికారి బి . హరి ప్రసాద రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా లోని అన్ని ఆప్కో విక్రయ శాలలలో అనగా లాలాచెరువు రాజమండ్రి, జండాపంజా రోడ్ రాజమండ్రి, కోటగుమ్మం రాజమండ్రి, గోకవరం బస్టాండ్ శివజ్యోతి థియేటర్ వద్ద రాజమండ్రి పట్టణాలలో గల ఆప్కో విక్రయ శాలలలో పై ఆఫర్ లు అందించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఆప్కో విక్రయ శాలలు సందర్శించి తమకు కావలసిన రాజమండ్రి, బందరు,వెంకటగిరి, మాధవరం, చీరాల, ఉప్పాడ చీరలు, షర్టింగ్, దోవతులు, దుప్పట్లు, లుంగీలు, టవల్స్ మొదలగు చేనేత వస్త్రాలు కొనుగోలుచేసి చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించి చేనేత కార్మికులను ఆదరించగలరని తెలియచేసారు. చేనేత కార్మికులనీ ప్రోత్సహించాలని కోరారు.