Breaking News

ఉచిత కంటి వైద్య శిబిరంలో, 200 మందికి పైగా పేదలకు కళ్ళజోళ్ళ పంపిణీ

-త్వరలో అన్ని డివిజన్ లలో కంటి వెలుగు శిబిరాలు, అన్ని వయసుల వారికి ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందులు పంపిణీ, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం లోని 59వ డివిజన్ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పాత మసీదు వద్ద గంగానమ్మ గుడి రోడ్డు నందు శుక్రవారం అమరావతి కంటి ఆసుపత్రి  వారి ఉచిత కంటి వైద్య శిబిరము ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి వృద్ధులకు అనుభవమైన వైద్యులతో కంప్యూటర్ పై కంటి చూపు నిర్ధారణ చేపించి షుగర్ మరియు బిపి ఉన్నవారికి కంటి రెటీనా పరీక్షలు తలనొప్పితో బాధపడుతున్న  వారికి ప్రత్యేక పరీక్షలు అవసరమైన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- నియోజకవర్గ మరియు కంటి పొర ఆపరేషన్లు, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా అమరావతి కంటి ఆసుపత్రి నందు ఉచితముగా నిర్వహిస్తున్నారని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం ఈ కంటి పరీక్ష శిబిరాల ద్వారా అనేక మంది ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది అని, వ్యాధుల నియంత్రణ అనేక వ్యాధులను తొలి దశలో గుర్తించి చికిత్స చేయడం వల్ల వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి సహాయపడింది అని, ప్రజలలో అవగాహన పెంచి అమరావతి కంటి ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం మెరుగుపడటానికి ఎంతగానో దోహదపడ్డాయి అని, ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించి ప్రజలకు వైద్యాన్ని ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా చూస్తామని బొండా ఉమ గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్ MD నాదెళ్ల వేణు, బ్రాంచ్ హెడ్ కోటి రత్నం, శ్యాం, డివిజన్ అధ్యక్షులు రాజాన బంగారు నాయుడు, డివిజన్ ఇంచార్జ్ SK జాన్ వలి, SK ఫర్వీన్, నందేటి ప్రేమ్, బుదాల సురేష్, మద్దాల మహేష్, SD గౌసియా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *