Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బొండా ఉమాకి ఘన స్వాగతం పలికారు

-రైతాంగ సమస్యలను బొండా ఉమా అడిగి తెలుసుకున్నారు, గత వైసిపి ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు అన్నారు
-గత వైసిపి కాలంలో రైతులు దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదన్నారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం లోని 64వ డివిజన్ విలేజ్ కుందా వారి కండ్రిక, సొసైటీ బ్యాంకు నందు దాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు ప్రారంభించారు ఈ సందర్భంగా బొండా ఉమా  మాట్లాడుతూ:-తెలుగుదేశం ప్రభుత్వం రైతంగ పక్షపాత ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యం ఏలేవారని , రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బొండా ఉమా చెప్పారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ, సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు, కుందా వారి కండ్రిక, నున్న, పాతపాడు, నైనవరం, అంబాపురం గ్రామాలలోనే వెయ్యి టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు.

ఈ ఏడాది ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాకు రూ.2300 ఇచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.  అకాల వర్షానికి కొద్దిమీర ధాన్యం తడిసిందని , తడిచిన ధాన్యం ప్రభుత్వపరంగా డబ్బులు మాత్రం కొనుగోలు చేసెలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు, రైతులకు టిడిపి  ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు, అనంతరం గ్రామంలో వర్షానికి తడిచిన ధాన్యాన్ని బొండా ఉమా  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి హరీష్, నాయి బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, డివిజన్ ఇన్చార్జి పలగాని శివ, పలగాలి భాగ్యలక్ష్మి, పొన్నం శేషగిరిరావు, కాకొల్లు రవి కుమార్, సాధం శ్రీనాద్, పంగిడియా, సుజుకి శ్రీను, రేఖ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *