Breaking News

సింగపూర్ ప్రతినిధుల బృందంతో సమావేశమైన సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మాదిరి గానే సింగపూర్ ప్రభుత్వం ఎపి ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విజ్ణప్తి చేశారు.ఈమేరకు సింగపూర్ ప్రతినిధుల బృందంతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఆర్డిఏ,మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సమావేశమై పలు అంశాలను చర్చించారు.2014-2019లో అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఒక కీలక భాగస్వామిగా ఉందని అదే స్థితిని ప్రస్తుతం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈప్రభుత్వం తిరిగి అధికారానికి వచ్చిన రోజు నుండే అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర నిధులతో పాటు ప్రపంచ బ్యాంకు,హడ్ కో,ఎడిబి వంటి సంస్థలతో పెద్దఎత్తున నిధులు టైఅప్ చేసిందని నిధులకు ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు.ఈనెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని నిర్మణ పనులను పున:ప్రారంభించేందుకు రానున్నారని సిఎస్ తెలిపారు.కావున గతంలో మాదిరే సింగపూర్ ప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు కృషి చేయాలని అన్నారు.గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో సమావేశం ఉన్నందున అన్ని అంశాలపై మరింత స్పష్టత వస్తుందని సిఎస్ విజయానంద్ చెప్పారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ మాట్లాడుతూ అమరావతి రాజధానిని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు.అమరావతి మాస్టర్ ప్రణాళికను గతంలోనే సిద్ధం చేయడం జరిగిందని గుర్తు చేశారు. అమరావతి రాజధానిని ప్రపంచంలోనే ఒక ఉత్తమ సస్టెయినబుల్ అండ్ అత్యంత లివబుల్ సిటీగా నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు.
అంతకు ముందు ఎపి సిఆర్డిఏ కమీషనర్ కె.కన్నబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ 217 చ.కి.మీల విస్తీర్ణంతో అమరావతి ప్రజా రాజధానిని నిర్మించేందుకు ఈప్రభుత్వం తిరిగి శరవేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు.దానిలో భాగంగానే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్సు,పలు ట్రంక్ రోడ్ల నిర్మాణం,ఇతర నిర్మాణాలు,సౌకర్యాల కల్పనకు సంబంధించిన పనులకు పెద్దఎత్తున నిధులు సమీకరించి పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పిలవడం జరిగిందన్నారు.ఈనెలలోనే ప్రధానమంత్రి సుమారు లక్ష కోట్ల రూ.ల పనుల పున:ప్రారంభం, పనులు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారని వివరించారు.ఇంకా పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను సింగపూర్ ప్రతినిధి బృందం దృష్టికి తెచ్చారు.
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి డా.ఫ్రాన్సిస్ చోంగ్(Dr.Francis Chong)మాట్లాడుతూ గతంలో వలె అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన భాగస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఎపి ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అన్నివిధాలా కృషి చేయనున్నట్టు తెలిపారు.
ఈసమావేశంలో అమరావతి డెవల్మెంట్ కార్పొరేషన్ లిమిడెట్ సిఎండి లక్ష్మీ పార్దసారధి,సిఆర్డిఏ అదనపు కమీషనర్లు ప్రవీణ్ చంద్,నవీన్,సింగపూర్ ప్రతినిధులు ఆడ్రే టాన్(Audrey Tan),డా.ఎలీజా ఆంగ్(Eliah Ang),నాజ్నీ బేగం(Naaznee Begum),వివేక్ రఘురామన్,డేన్సై టాన్(Densie Tan),వైష్టవి వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇక 10 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్ పూర్తి

-గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం లేదు -స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ -ప్రస్తుతం 26 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *