-పలు రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించిన టి.జి భరత్
-అభివృద్ధి చెందుతున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గురించి చర్చించిన టి.జి భరత్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు నుండి ముంబైకి మరియు కర్నూలు నుండి విజయవాడకు కొత్త రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు టి.జి భరత్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు కర్నూలు రాజధానిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంతాన్ని రైల్వే పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని విన్నవించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్‌లో ఎన్నో పరిశ్రమలు రానున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. భవిష్యత్తులో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఓర్వకల్లు మారబోతుందన్నారు. ఈ ప్రాంతానికి దేశంలోని ప్రధాన నగరాలతో రైలు రాకపోకలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు టి.జి భరత్ తెలిపారు. ఈ రైల్వే సౌకర్యాలపై తప్పకుండా పరిశీలిస్తామని ఆయన చెప్పారన్నారు.