Breaking News

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

-నివాళులర్పించిన ఎన్డీఏ కూటమి నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్ బీ కాలనీ షెడ్యూల్డ్ కులముల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలు శనివారం అప్నా బజార్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జనసేన 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష, టిడిపి 42 వ డివిజన్ అధ్యక్షులు శివాజీ ముదిరాజ్, ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య , జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ ఎన్డీఏ కూటమినేతలు పాల్గొని కేక్ కట్ చేసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అణగారిన వర్గాల పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్… : తిరుపతి అనూష
తిరుపతి అనూష మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అంకితభావంతో దేశానికి ఎంతో సేవలను అందించారని , ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం పాటుపడ్డారన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలని అభ్యున్నతి లోకి తీసుకువచ్చిన వ్యక్తి అని దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ బీ కాలనీ షెడ్యూల్డ్ కులముల సంక్షేమ సంఘం అధ్యక్షులు జెట్టి రామారావు, సెక్రెటరీ దాసరి బుజ్జి హెచ్ బి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు భాస్కర రావు, రవికుమార్, శశాంక్ బాబు, జయరాజు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ సీతారాముల క‌ల్యాణంలో శ్రీ‌రామ గానామృతంతో మైమ‌రిచిన భ‌క్తులు

ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త : ఒంటిమిట్ట శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వం సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు బెంగూళూరుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *