-కులరహిత సమాజం కోసం పోరాడిన నవయుగ వైతాళికుడు బాబూ జగ్జీవన్ రామ్
-బాబూ జగ్జీవన్ రామ్ కు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఘన నివాళి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలు ఉన్నత స్థానంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ4 అనే విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. శిఖామణి సెంటర్ లో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. శిఖామణి సెంటర్ లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు ఎంపి కేశినేని శివనాథ్ స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పోరాడి నవయుగ వైతాళికుడు బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘస్కర్త, సమాతా వాది, స్వాతంత్య్ర సమరయోధుడు జగ్జీవన్ రామ్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసే పీ4 కార్యక్రమం వల్ల 40 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని, అట్టడుగు నుండే 20 శాతం మంది పేదలకు, ధనికులుగా ఉండే 10 శాతం మంది విద్యా, వైద్య, ఇతర మౌలిక వసతులు సహకారాలు అందించటమే పీ4 లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి లక్ష్మణరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి దోమకొండ రవికుమార్, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, ఎపి బిల్డింగ్ అదర్స్ కనస్ట్రక్షన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, 2వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు దాసరి గాబ్రియేల్, 3వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు బాబురావు, 6వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పడాల గంగాధర్, టిడిపి నాయకులు మాదిగాని గురునాథం, చాట్ల రాజశేఖర్, వేశ్యపోగు జాన్ భాస్కర్, నరసింహాచౌదరి, అబీద్ హుస్సెన్, వేదవ్యాస్,పట్నాల హరిబాబు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.