Breaking News

గ్రామంలో పుట్టి ఉప ప్రధాని స్థాయికి ఎదిగి చరిత్ర సృష్టించారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బీహార్ లోని మారుమూల గ్రామంలో పుట్టి ఉప ప్రధాని స్థాయికి ఎదిగి చరిత్ర సృష్టించారని, సామాజిక న్యాయం అనే సిద్దంతాన్ని బలంగా ప్రజల్లో తీసుకొని వెళ్ళిన మహనీయులు డా.బాబు జగజ్జివన్ రామ్ అని, అటువంటి మహనీయుని జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం ఏపిల సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత మాజీ ఉప ప్రధాని సమతావాది డా.బాబు జగజ్జివన్ రామ్ 118వ జయంతి వేడుకలు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నసిర్ అహ్మద్ అధ్యక్షత వహించగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళ మాధవి, ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీల పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డా.బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ డా.బాబు జగజ్జివన్ రామ్  స్పూర్తి వారి యొక్క జీవన ప్రయాణం ఎక్కడో బీహార్ లోని మారుమూల గ్రామంలో పుట్టి అక్కడ నుండి స్వాతంత్ర్య సమరయోధునిగా, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేంద్ర మంత్రిగా ఒక చరిత్ర సృష్టించారని సుదీర్ఘ కాలం 40 సంవత్సరాల పాటు ఆయన ఆహార శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పలు ఇతర క్యాబినెట్ హోదాలలో పనిచేసే పదవులకే వన్నెతెచ్చారన్నారు. తొలి దళిత ఉప ప్రధాని పదవితో పాటు అనేక పదవులను పోషిస్తూ మనకు సంకల్పం ఉంటే మనలను ఎవరు ఆపలేరని ఒక స్ఫూర్తిని కలిగించిన, వారి జయంతిని ఈ రోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. సామాజిక న్యాయం అనేది రాజ్యాంగానికి ఒక మూల స్తంభం లాంటిదని, సామాజిక న్యాయ సిద్దంతాన్ని గొప్పగా భలంగా ముందుకు తీసుకువెళ్లారని, ఈరోజు మనం ఇక్కడ ఉండగలుగుతున్నామంటే దాని పాత్ర ఎంతో ఉందని తెలుపుకుంటు డా.బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని మనందరం వారి అడుగు జాడల్లో నడుచుకోవాలని కోరుకుంటున్నామన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సభలో మాట్లాడి ఎంతో స్పూర్తి నింపిన నాయకులు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానని వాటిని ప్రభుత్వ పరిశీలనకు పంపుతానని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహమ్మద్ మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగా డా.బాబు జగ్జీవన్ రామ్ దళిత జాతి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. వారి అడుగు జాడల్లోనే కూటమి ప్రభుత్వం నడుస్తుందని వెల్లడించారు. దళితుల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసి, వారు అన్నివిధాల అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించారన్నారు. గత ప్రభుత్వం దళితులను కేవలం ఓటు బ్యాంక్ గానే చూసిందన్నారు. దళితులకు రాజ్యాధికారం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. వెనుకపడిన దళితులను పి4 పధకం ద్వారా ఉన్నత స్థాయికి తీసుకువస్తామని, దళితుల సంక్షేమం కోసం అనేక పధకాలు రూపొందించడం జరిగిందన్నారు. దళిత వాడల్లో రోడ్లు, మంచి నీటి కుళాయిలు, మౌళిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళ మాధవి మాట్లాడుతూ గాంధీ ఆశయాలను పుణికి పుచ్చుకున్నమహనీయుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 5,12,14 అక్టోబర్ 2 సెలవు దినాలుగా మాత్రమే విద్యార్ధులకు తెలుసునని ఆ తేదీల్లోని మహనీయుల చరిత్రలు తెలియవని, పిల్లలుకు ఆ మహనీయుల జయంతి సందర్భంగా ఎస్సే రైటింగ్, క్విజ్ లాంటివి నిర్వహించి అలాంటి, వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని పిల్లలు ఎదిగేలా చూడాలని విద్యాశాఖ కు సూచించారు. స్వాతంత్ర్య సాధనలో డా.బాబు జగ్జీవన్ రామ్ గారి కృషి ఎంతో ఉందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్ధికంగా, సామజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ఎన్నో సంస్కరణ తెచ్చారని కొనియాడారు. ఎన్నో పదవులను అధిరోహించిన వ్యక్తని అలాంటి మహనీయుల అడుగుజాడల్లో మనమంతా నడవాలని పిలుపునిచ్చారు.
గుంటూరు నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక సజీల మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నత కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శినియులన్నారు. స్వాతంత్ర్య సమరయోదులైన వీరు రాజకీయ, సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేశారని, విద్యార్ధులు స్వాతంత్ర్య సమరయోధులు గురించి తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. గౌ.ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు బడుగు, బలహీన వర్గాల కోసం 27 పధకాలు తీసుకువచ్చారని దళిత వాడల్లో రోడ్లు, నీళ్ళు, మౌళిక వసతులు సమకూర్చారని తెలియజేశారు.
గుంటూరు నగర పాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ భావి తరాలకు ఒక సందేశాన్ని పంపేందుకు డా.బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దళిత కుటుంబాలలో పుట్టి వివక్షకు గురి అయి ఉప ప్రధాన స్థాయికి ఎదిగిన మహనీయుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప వ్యక్తిగా డా.బాబు జగ్జీవన్ రామ్ నిలిచారన్నారు. నేటి విద్యార్ధులు ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారు ఎదగాలని ఆకాంక్షించారు.
సభలో పాల్గొన్న వివిధ దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ 50 సంవత్సరాలు సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన వారిని 1936 నుండి 1986 వరకు ఓటమి ఎరగని నేతని, 34 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో మంత్రిగా పని చేసి అనేక సంస్కరణలు చేపట్టారని, సరైన గుర్తింపు రాలేదని వీరికి ప్రభుత్వం భారత రత్న అవార్డ్ కు సిఫార్సు చేయాలని కోరారు. రాజధాని అమరావతిలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో అనగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరిగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోదుడు, సమతవాది డా.బాబు జగ్జీవన్ రామ్, డా.బి‌ఆర్ అంబేడ్కర్ దళితులకు రెండు కళ్లు లాంటి వారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగా మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన డా.బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు, గుంటూరు తూర్పు, పశ్చిమ శాసన సభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, గళ్ళ మాధవి, నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీల, నగర పాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు, ఆర్‌డి‌ఓ శ్రీనివాసులు, డి‌ఆర్‌ఓ ఖాజావళి, ఎస్.సి కార్పొరేషన్ ఈడి దుర్గాబాయి, ఎం‌ఎల్‌సి చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎం‌ఎల్‌ఏ మస్తాన్ వాలి, నగరపాలక సంస్థ కార్పొరేటర్ పోతురాజు సమత వివిధ దళిత సంఘాల నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ సీతారాముల క‌ల్యాణంలో శ్రీ‌రామ గానామృతంతో మైమ‌రిచిన భ‌క్తులు

ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త : ఒంటిమిట్ట శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వం సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు బెంగూళూరుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *