-శ్రీరామ నవమి శుభాకంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామ నవమి సందర్భంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు ప్రతి ఇంట శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరాముడు పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా వుండేవారు. ఆ రాముడి ఆశీస్సులతో పేదవారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీరాముడు ఒక పాలన విషయంలోనే కాదు. జీవితంలో ఆచరించాల్సిన అనేక విషయాల్లో ఆదర్శప్రాయుడు. ధర్మం పట్ల శ్రీరాముని నిబద్ధత, లక్ష్మణుని అనుసరణ, భరతుని బాధ్యత, హనుమంతుని సేవభావం గొప్పవి. వీటిని అలవరచుకోవాలని జీవితంలో అందరూ విజయం సాధించాలి. ఈ శ్రీరామనవమి ప్రతి ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని ఆకాంక్షించారు