-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘసంస్కర్త, రాజకీయ వేత్త బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషిచేశారని, విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. అంతటి మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో అంటరానితనం, కులవివక్షను రూపుమాపేందుకు కృషిచేశారని, ఆయన చేసిన సేవలను ప్రజలలోనికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, బాబు జగ్జీవన్ రామ్ అందించిన స్పూర్తితో సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి నేటి యువత కృషిచేయాలన్నారు.