Breaking News

సీఆర్డీయే 46వ అథారిటీ స‌మావేశం.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్ డిఎ 46వ అథారిటీ సమావేశం ఉండవల్లిలో జరిగింది. మునిసిపల్ శాఖా మంత్రి పి. నారాయణ తో పాటు అధికారులు పాల్గొన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో స‌మీక‌రించేందుకు సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ కు అసుమ‌తిస్తూ అథారిటీ నిర్ణ‌యం. ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవ‌స‌ర‌మైన నిధుల‌ను వివిధ ఫైనాన్సియ‌ల్ ఇన్ స్టిట్యూష‌న్స్ నుంచి స‌మీక‌రించేందుకు సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ కు అనుమ‌తి. అసెంబ్లీ,హైకోర్టు భ‌వ‌నాల టెండ‌ర్ల‌కు ఆమోదం తెలిపిన అథారిటీ.ఎల్ వ‌న్ గా నిలిచిన సంస్థ‌ల‌కు లెట‌ర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోద‌ముద్ర‌. అసెంబ్లీ — బేస్ మెంట్ + జీ + 3 + వ్యూయింగ్ ప్లాట్ ఫాంలు + ప‌నోర‌మిక్ వ్యూ(బిల్ట‌ప్ ఏరియా 11.22 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు,ఎత్తు 250 మీట‌ర్లు).అసెంబ్లీ నిర్మాణానికి టెండ‌ర్ల‌లో ఎల్ వ‌న్ గా నిలిచిన సంస్థ‌ కు LOA ఇచ్చేందుకు ఆమోదం. హైకోర్టు — బేస్ మెంట్ + జీ + 7 అంస్తుల్లో నిర్మాణం. బిల్ట‌ప్ ఏరియా 20.32 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు..ఎత్తు 55 మీట‌ర్లు…ఎల్ వ‌న్ గా నిలిచిన సంస్థ‌కు LOA ఇచ్చేందుకు ఆమోదం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ సీతారాముల క‌ల్యాణంలో శ్రీ‌రామ గానామృతంతో మైమ‌రిచిన భ‌క్తులు

ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త : ఒంటిమిట్ట శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వం సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు బెంగూళూరుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *