-అభినందనలు తెలిపిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ గా మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, కౌన్సిల్ సభ్యుడిగా వడ్లమాని సుధాకర్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనలు తెలిపారు .
ఎసిఎ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా జరిగింది. ఈ జూమ్ మీటింగ్ లోనే గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ ఎన్నికను నిర్వహించారు. త్వరలో జరగనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్- 2025. నిర్వహణ బాధ్యతలను చైర్మన్ హోదాలో సుజయ్ కృష్ణ రంగారావు గారు చేపట్టనున్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణ పై త్వరలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తేదీ ఖరారు గురించి, ఫ్రాంచైజ్ లు అంశాలు చర్చకు రానున్నాయి.
తనని 2025 ఆంధ్రా ప్రీమియర్ లీగ్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి, రాజ్యసభ ఎంపి సానా సతీష్ బాబు, అపెక్స్ మెంబెర్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు.