Breaking News

స్పందనలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…

-గుడివాడ డివిజన్ లో కోవిడ్ కట్టడికి ప్రత్యేక డ్రైవ్..ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి..
-వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో డివిజన్లో 50 గ్రామాల్లో రీ సర్వే..
-వాణిజ్య వ్యాపాలసంస్థలు మాస్కులు లేకుండా వచ్చిన వారికి అమ్మకాలు నిషేదించాలి..
-ఆర్డీవో జి. శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ పరిదిలోని ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కొరకు స్పందనలో ధరఖాస్తు చేసిన అర్జీదారుల సమస్యలు నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు.
స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు స్పందన లో దరఖాస్తు చేసిన అర్జీలను నిర్ణీత గడువులోపే పరిష్కరించి అర్జీదారునికి పరిష్కార పత్రాన్ని అందజేయాలని అధికారులకు సూచించారు. తమ పరిధిలో లేని ధరఖాస్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీ అధికారులు తమ కార్యాలయానికి వచ్చిన అర్జీలను సక్రమంగా తేదీల వారీ వరస క్రమంలో రిజిష్టరు లో నమోదు చేసి అర్జీదారునికి ఆన్ లైన్ రశీదును అందజేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరు స్పందన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు.

గుడివాడ డివిజన్ లో కోవిడ్ కట్టడికి ప్రత్యేక డ్రైవ్ ఆర్డీవో శ్రీనుకుమార్
డివిజన్ పరిధిలో గల నందివాడ, మండలవల్లి, గుడివాడల్లో కోవిడ్ పోజటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయని ఈ మేరకు కోవిడ్ కట్టడికి ఈ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైన్ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహనతో పాటు ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్ అందిస్తూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. గుడివాడ అర్బన్ తో పాటు అన్ని గ్రామాల్లో వాణిజ్య వ్వాపార దుకాణాల్లో నోమాస్క్ నో సేల్ అనే విధంగా వినియోగదారునితో పాటు దుకాణ యజమానులు తప్పనిసరిగా మాస్కులు ధరంచాలన్నారు. ఇందుకు విరుద్దంగా ఏవరైనా కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే అటువంటి దుకాణ దారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందికదా అని ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగవద్దని అవసమైతేనే వెళ్ళాని ఆర్డీవో సూచించారు. జిల్లా కలెక్టరు వారి ఆదేశాలు మేరకు వారానికి మూడు రోజులు నోమాస్క్ నో ఎంట్రీ, నోమాస్క్ నో రైడ్, నోమాస్ నోసేల్ అనే విధంగా ప్రజల్లో కోవిడ్ నియంత్రణపై అవగాహన కల్పించే విదంగా డివిజన్ పరిధిలో చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ వారి పరిధిలో గలసచివాలయాలు, పీహెచ్సీలు ద్వారా వేయించుకువోలన్నారు.కోవిడ్ థర్డ్ వేవ్ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున భౌతిక దూరం, శానిటైజర్లు వినియోగించడం వంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ కు దూరంగా ఉండాలని ఆర్డీవో శ్రీనుకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు
వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా 50 గ్రామాల్లో రీసర్వే.. ఆర్డీవో..
వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా డివిజన్ పరిధిలోని గుడ్లవల్లేరు, పామర్రు మండలంలో 50 గ్రామాల్లో గ్రామ సరిహద్దులు తెలిపేవిధంగా డ్రోన్ సహాయంతో రీసర్వే పనులు చేపట్టామన్నారు. ఈ సర్వే పనులు పూర్తయిన తదుపరి డివిజన్ లోని 9 మండలాల్లో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున డ్రోన్ సర్వే చేపట్టడం జరగుతుందన్నారు. సర్వే సమయంలో ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మండల డిప్యూటీ తాహశీల్థారుకు పరిష్కారం నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు.

అర్జీలు :- కలిదిండి మండలం ఆరుతెగలపాడు గ్రామానికి చెందిన తమనాల కృష్ణకుమారి తమ అర్జీలో తన తాతగారైన బోయిన పిచ్చియ్య ముదనేపల్లి మడలం వణుదుర్రు, పెదగొన్నూరు గ్రామాల్లో ఉన్న 3.22 సెంట్ల భూమిని వీలునామా రిజిష్టరు చేసారని ఆభూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించవలసిందిగా కోరారు.
గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరు గ్రామానికి చెందిన ఖండవల్లి వెంకట కృష్ణారావు తమ అర్జీలో ఇంటి నిర్మాణం కొరకు బ్యాంకు లోన్ తీసుకొనే నిమిత్తం ఇంటి స్థలాన్ని సర్వే చేసి ధృవ పత్రాన్ని జారీ చేయవలసిందిగా కోరారు.
నందివాడ మండలం జనార్థనపురం నందు గల టెలిపోన్ కాలనీకి చెందిన పి. లలిత ఇతరులు తమ అర్జీలో గుడివాడ మున్సిపాలిటికి సంబందించిన చెత్తను జనార్థనపురంలో ఉన్న డంపింగ్ యార్డుకు తరళించి రోజు తగుల బెట్టడం వలన విపరీతమైన దుర్వాసన వెదజల్లుతుండటం వలన కాలనీ వాసులు అనేక ఇబ్బందలకు గురిఅవుతున్నారు. కావున డంపింగ్ యార్డును ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరించాల్సిందిగా వారు ఆ అర్జీలో కోరారు.
నందివాడ మండలం రామాపురం గ్రామ నివాసి నడిమింటి మల్లేశ్వరి తమ అర్జీలో తన తండ్రిగారు ఇచ్చిన భూమికి 2015 నుంచి పన్నులు కట్టించుకోవడంలేదని, ఈ మద్యకాలంలో ఆ భూమిని చేపల చేరువుగా మార్చడం జరిగిందని లీజుదారుడు యస్.యస్.రాజు ఇప్పటి వరకు లీజు కూడా చెల్లించలేదని కావున న్యాయం చెయ్యాలని ఆర్జీలో పేర్కొన్నారు.
గుడివాడ కాపు సంఘ అధ్యక్షులు నమంచి రాంబాబు, త్రినాద్ జిల్లా కార్యదర్శి సందు పవన్ తమ అర్జీలో కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్ అమలు చేయ్యాలని, అదేవిధంగా కాపుల సంక్షేమానికి ప్రభుత్వం 5 వేల కోట్లు నిధులు మంజూరు చేసి కాపులను ఆధుకోవాలని వినతి పత్రాన్ని అందించారు. సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనిట్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ సీపీ రెడ్డి తమ ఆర్జీలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దుచెయ్యాలని, అదేవిదంగా రైతు చట్టాలను సవరించడంతో పాటు మద్దతు ధరను చట్టంచెయ్యాలని, పెట్రోలు, గ్యాస్, నిత్యావసర వస్తుల ధరలు పెంపు తగ్గించాలని వారు తమ అర్జీలో కోరారు.

Check Also

పెదపాలపర్రు రెవిన్యూ సదస్సుకు ఆర్ పి సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *