Breaking News

సంకల్పం గొప్పదైతే యాగ ఫలితం సిద్దిస్తుంది…

-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-మందస వాసుదేవ ఆలయంలో వరుణ యాగం
-వరుణ యాగానికి వర్షం. హర్షం వ్యక్తం చేసిన మంత్రి
-సంకల్ప ఫలితమే వర్ష సూచన ఆనందంలో ప్రజలు

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
సంకల్ప బలం గొప్పదైతే ఫలితం సిద్దిస్తుంది అని అంటారు పెద్దలు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరిన రాజు యజ్ఞ యాగాదులు చేస్తుంటారు. ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో అదే జరిగింది. తన నియోజకవర్గంలో ప్రజలు వర్షాభావ పరిస్థితులలో ఉంటూ రైతులు వరి నాట్లు వేసేందుకు ఇబ్బందులు, ప్రజలకు నీటి కష్టాలు గుర్తించి భగంతుని సన్నిధిలో నిష్ట నియమాలతో వరుణ యాగం చేసేందుకు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సంకల్పం చేపట్టారు. అదే సంకల్పంతో గురువారం మందస పెరుమాళ్ ఆలయంలో వరుణ యాగం పూర్తి చేశారు. ఆయన సంకల్పానికి దేవుని కృప అందించారు. అందుకే యాగం పూర్తి అయ్యే సరికి వర్షం పడింది. ప్రజల ముఖాల్లో వెలుగు చూసి వర్షానికి హర్షం వ్యక్తం చేశారు. అందుకే పెద్దలు అంటారు సంకల్పంతో ఏ పని చేసినా ఫలితం సిద్దించక తప్పదు అని ఇది ముమ్మాటికి నిజం తనను నమ్ముకున్న ప్రజలు ఎప్పటికి సుభిక్షంగా ఉండాలనేది ఆయన సంకల్పం.  శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలంటే జిల్లాలో, పలాస నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవాలని. పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందాలని కోరుతూ రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వాసుదేవుడికి పూజలు చేశారు. గురువారం మందస లోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో వరుణ యాగం చేపట్టారు. వేద పండితులతో పలాస నియోజకవర్గం నాయకులు, ప్రజలు రైతులతో కలిసి వరుణ యాగం నిర్వహించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఏమిచేయాలని వేద పండితుల సలహా మేరకు నియోజకవర్గం ప్రజల మేలు కోరి యగాలు, యజ్ఞాలు చేస్తే ఫలితం ఉంటుందని వేదపండితులు తెలియజేయడంతో గురువారం మందస వాసుదేవ ఆలయంలో యాగం చేపట్టారు. ఎంతో చరిత్రకల్గిన దేవాలయంలో ప్రకృతి సమతుల్యతను కోరుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు నీటి వరనరులు అందించేలా భగవంతుని సన్నిధిలో యాగం చేయడం ఎంతో శుభపరిణామం. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజు మందస వాసుదేవ ఆలయ పండితులతో వరుణయాగాన్ని చేపట్టారు. జిల్లాలోని నాగావళి, వంశధార, బాహుదా నదులు ఉన్నాయి. వాటిపై రిజర్వాయర్లు కూడా ఉన్నాయని నదులలో నీటి ప్రవాహం పెరిగి సంబందిత రిజర్వాయర్ లలో నీటి నిలువలు పెరగాలని దేవుడ్ని కోరామని అన్నారు. పలాస నియోజకవర్గంలోని చెదువులు, మందస మండలం లోని కళింగదళ్, డబారుసింగి రిజృవాయర్లు కూడా నీటితో కలకల లాడాలని వరుణయాగం చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు వర్షాభావ ప్రమాదం నుండి గట్టెక్కి వర్షాలు విరివిగా కురవాలని కోరారు. వరణ యాగం పూర్తి అయ్యే లోగా మందస, పలాస ప్రాంతాల్లో వర్షం కురవడం చూస్తే మంత్రి ఏ సంకల్పంతో అయితే వరుణ యాగం చేపట్టారో ఆ సంకల్పం సిద్దించేందుకు భగవంతుడు, వరుణ దేవుడు వర్షం కురిపించడం ఎంతో ఆనందదాయకం. పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు మేలుకోరి యాగం చేసేందుకు వేద పండితులు, నియోజకవర్గం నాయకులు, ప్రజలు వరుణ యాగం కోసం మందస వాసుదేవుని ఆలయం వద్దకు భారీగా చేరుకోవడం ఏంతో సంతోషంగా ఉందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని దేవుని ఆశిస్సులు ప్రజలపై ఉండాలని కోరుతూ శ్రీదేవి ,భూదేవి సమేత వాసుదేవు పెరుమాళ్ కు మొక్కలు చెల్లించారు. యాగ ఫలితం కూడా ప్రజలందరికి అందాలని సంకల్పం చేశారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *