-ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సంతృప్తికరమైన సేవలందించండి..
-తెల్ల రేషన్ కార్డు కలిగిన సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కార్డులు వెంటనే సరెండర్ చెయ్యాలి..
-జాయింట్ కలెక్టర్( రెవెన్యూ మరియు రైతు భరోసా ) కే. మాధవీలత
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల సంక్షేమ కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సకాలంలో వారికి అందించే విధంగా సచివాలయ ఉద్యోగులు సమయ పాలను పాటించాలని జాయింట్ కలెక్టర్( రెవెన్యూ మరియు రైతు భరోసా) కే. మాధవీలత అన్నారు. గురువారం పామర్రు మండలం పామర్రులో గల 3, 4, 5 గ్రామ సచివాలయాను స్థానిక తాహశీల్థారు, యంపీడీలోతో కలసి జాయింట్ కలెక్టరు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు కె. మాధవీలత మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు సంతృప్తికరమైన సేవలందించాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి అలసత్యం వహించిన సంబందిత ఉద్యోగులపై క్రమ శిక్షణాచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల అర్హతలు, మంజూరయిన వారి జాబితాలు, సూచిక బోర్డుల్లో ప్రదర్శించిన వారిటిని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ప్రతి సచివాలయంతో పాటు ప్రభుత్వఉద్యోగులు బయోమెట్రిక్ విదానాన్ని పాటించాలన్నారు. ఇప్పటి వరకు సచివాలయాలకు ప్రజా సమస్యలపై ఎన్ని అర్జీలు వచ్చాయి. వాటిలో ఎన్నింటిని పరిష్కరించారు అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల పరిదిలో ఇప్పటి వరకు ఎంతమందికి కోవిడ్ వ్యాక్సిన్ ఎంత మంది వేశారు వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని ప్రజలకు వారి ఇంటి వద్దనే అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందించేందుకే సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అమలులో జాప్యం లేకుండా పారదర్శకంగా ప్రజలకు సంతృప్తికరమైన సేవలను అందించాలన్నారు. గ్రామ వాలెంటీర్లు, ఆశావర్కరు, వైద్యసిబ్బంది కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి ఖచ్చితంగా ఫీవర్ సర్వే చెయ్యాలని, వెళ్లకుండానే వెళ్లినట్లు నివేదికలు పంపినట్లు వెల్లడైతే వారిపై చర్యలు తీసుకోవడం జరగుుతుందన్నారు. అనంతరం సివిల్ సప్లై డీయం తో కలసి పామర్రులో గల లక్ష్మీ ట్రేడర్సు, వెంకటేశ్వర ట్రేడర్సు రైస్ మిల్లులను తనిఖీచేసి రెన్యువల్ గడువు ముగిసిన ఒక రైస్ మిల్లుకు వెంటనే రెన్యూవల్ చేయించుకోవాలని వారికి సూచించారు. తదుపరి స్టాక్ గొడౌన్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టరు వెంట తాహశీల్థారు ఎన్. సురేష్, యంపీడీవో రామకృష్ణ, పీడీఎస్ డీటీ భవాని, సచివాలయ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.