-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
-కరోనా ఫ్రీ నగరంగా విజయవాడ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-రాజ్యాంగబద్దంగా నామినేషన్ పద్దతిలోనే ఐదుగురి సభ్యుల ఎన్నిక : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ కౌన్సిల్ లో మంచి నిర్ణయలు తీసుకుని విజయవాడను అభివృద్ది దిశగా తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా బీసీ లకు అధిక ప్రాదాన్యత ఇవ్వడం జరిగిందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
శనివారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ సమావేశంలో ఐదు సభ్యులను విజయవాడ నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యులు ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీకరిమునిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఐదుగురు నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యులను అభినందించి, సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయాలని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా ఐదుగురి నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికోవడం జరిగిందన్నారు. ఇంకా పార్టీకి సేవలు చేసిన వారికి కూడా న్యాయం చేయడం జరుగుతుందన్నారు. మైనార్టీలకు జగనన్న ప్రభుత్వం అధిక ప్రాదాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. అందరిని కలుపుకుని విజయవాడ నగరాభివృద్దికి కృషి చేస్తామన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నగర పాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లు తమ డివిజన్‌లో అందరు వ్యాక్సిన్ వేయించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా నగరంలో అన్ని సచివాలయల్లో జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియ సందర్శించాలని సూచించారు. అందరు బాధ్యత వహించాలని కోరారు.
కరోనా ఫ్రీ నగరంగా విజయవాడ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
కరోనా ఫ్రీ నగరంగా విజయవాడ మారాలని అందుకు అందరు సహకరించి, వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు… నగర పాలక సంస్థ అధ్వర్యంలో జరుగుతున్న వ్యాక్సిన్ అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యులు ఐదుగురి ఎన్నికోవడం జరిగిందన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా సభ్యుల ఎన్నిక జరిగిందన్నారు.
రాజ్యాంగబద్దంగా నామినేషన్ పద్దతిలోనే ఐదుగురి సభ్యుల ఎన్నిక : మేయర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్ అధార్టీ, కమిషనర్ అండ్ డైరుక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిన్‌స్ట్రేషన్ వారి సర్క్యులర్ ప్రకారం రాజ్యాంగబద్దంగా నామినేషన్ పద్దతిలోనే ఐదుగురి సభ్యులను నగర పాలక సంస్థ కో-అప్టు సభ్యులు ఎన్నికోవడం జరిగిందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగరంలోని 64 మందితో కలిపి 5 గురు సభ్యుల కూడా నగరాభివృద్దికి కృషి చేయాలన్నారు.