-మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్ అధార్టీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిన్‌స్ట్రేషన్ వారి సర్క్యులర్ ప్రకారం మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరిని, మునిసిపల్ పాలనపై ప్రత్యేక అనుభవం కల్గిన ముగ్గురు వ్యక్తులు కలిపి మొత్తం ఐదు సభ్యులను విజయవాడ నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీకరిమునిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పలువురు కార్పొరేటర్లు పాల్గొని ఐదుగురు నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యులను అభినందించి, సన్మానించారు.