విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి నగర అధ్యక్షుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు.
47 డివిజన్లో వేంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని 50 కేజీల భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పడకేసిందని అందుకనే రాష్ట్రవ్యాప్తంగా గోతులు రోడ్ల కనీస మరమ్మతులు జగన్ గారి ప్రభుత్వం చేయడం లేదని, ప్రభుత్వం ముద్దు నిద్ర లేపెందుకే పవన్ కళ్యాణ్ గారు డిజిటల్ మీడియా ద్వారా గోతులు పడ్డ రోడ్లను ఫోటోలు తీసి నిరసన తెలియజేసేలాగా పిలుపునిచ్చారని, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని, అదేవిధంగా విజయవాడ నగర అభివృద్ధి కోసం 600 కోట్ల రూపాయలు కేటాయించారని మేయర్ మరియు వైసిపి కార్పొరేటర్లు పదేపదే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, నిజంగా ఆరు వందల కోట్ల రూపాయలు విజయవాడ నగర అభివృద్ధికి కేటాయిస్తే ఎందుకు కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయడం లేదు సమాధానం చెప్పాలని ,అదేవిధంగా జీవో నెంబర్ 198,197,196 ప్రజలపై ఇంటి పన్ను, నీటి పన్ను , చెత్త పన్ను, ద్వారా 450 కోట్ల రూపాయల అదనపు భారం ఎందుకు మోపరో సమాధానం చెప్పాలని, అభివృద్ధి అంటే ప్రజల్ని పన్ను పోటుకు గురి చేయడమ ఆని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు సితార సెంటర్ వద్ద, వి ఎం సి ప్రధాన కార్యాలయం రోడ్డులో, నెహ్రూ బొమ్మ సెంటర్, వన్ టౌన్ తదితర ప్రాంతాల్లో రోడ్లను సందర్శించి పార్టీ సూచించిన హాష్ ట్యాగ్ త్వర ఫోటోలను డిజిటల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగిందని తెలియజేశారు .
హోల్సేల్ పూల మార్కెట్ వద్ద 30 కేజీల భారీ కేకును పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీను నాయుడు మిత్ర బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
53వ డివిజన్ కోమల విలాస్ సెంటర్ వద్ద నల్లబెల్లి కనకారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ చేసి అనంతరం ఐదు వందల మంది పేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
44వ డివిజన్ నాయకులు మల్లెపువ్వు జయలక్ష్మి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ చేసిన అనంతరం పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.
45వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు బొమ్మ గోవిందు లక్ష్మీ రాంబాబు లు సితార సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ చేసిన అనంతరం వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
రమణ బడ్డీకొట్టు సెంటర్ వద్ద సలగు. నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది
26వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు షేక్ అమిర్ భాష షర్మిల దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం పేదలకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.
ఎర్ర కట్ట ప్రెజర్ పేట వద్ద డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువతను ప్రశంసించి రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యువతదే అగ్రస్థానంని తప్పక రాజకీయాల్లో క్రియాశీలకంగా యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బ్రాహ్మణ వీధిలో పైడి మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని వెయ్యిమందికి అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
కెనాల్ రోడ్డు కనకదుర్గ నగర్ వద్ద దుక్కా .సాంబా ,దిండి నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 500 మందికి అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
చింతపల్లి అజయ్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మరియు రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ ప్రతాప్ ప్రధాన కార్యదర్శి కోటేశ్వరావు, కిరణ్ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది.
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50 వ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంగా పోరాడుతుంది కేవలం జనసేన పార్టీ మాత్రమేనని, రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అధికారపక్షంగా మారబోతుందని,జనసేన విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తెలియజేశారు. అధికార పార్టీ నాయకులు కి అక్రమ నిర్మాణాలపై ఉన్న శ్రద్ధ రోడ్ల కు పడ్డ గోతులు బాగు చేయడంపై ఏమాత్రం లేదని, ప్రజల అవస్థలు వారికి ఏమాత్రం పట్టడం లేదని, అందుకనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు రోడ్ల పై గోతులను అన్ని చోట్ల పరిశీలించి డిజిటల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వ మొద్దు నిద్ర ను లేపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొర్ర గంజి రమణ, నాగరాజు, లింగం శివ ప్రసాద్, సాంబ,సాయి కుమార్ తమ్మిన రఘు, మద్దెల కనకారావు, గన్ను శంకర్, తమ్మిన లీలా కరుణాకర్, మురళి, రాజా నాయుడ, అగ్రహారంపు రాజు, ఏలూరు శరత్, వడే,పిళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.