-ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి…
-ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో కోవిడ్ నిబందనలు పాటించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి…
-ఆర్డీ వో ఖాజావలి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ పరిధిలోని మండల స్థాయిఅధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్థేశించిన లక్ష్యాలను సాధించాలని ఆర్డీ వో(ఇంచార్ఛి)ఎన్ఎస్ కె ఖాజావలి అన్నారు.
గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఖాజావలి డివిజన్ లోని తాహశీల్థార్లుతో డివిజన్ పరిధిలో జరుగుతున్నఅభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా జగనన్న ఇళ్ల స్థలాల భూసేకరణ, నేషనల్ హైవే భూసేకరణ, బిఎల్ఎన్ డిఎస్, రీసర్వే, ఫీవర్ సర్వే, ఇళ్ల స్థలాల కోర్టు కేసులు, స్పందనలో వచ్చిన అర్జీల పరిష్కారం వంటి పలు అంశాలుపై అధికారులతో ఆర్డీవో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడూతూ డివిజన్ పరిదిలో రెవిన్యూ, గృహనిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ డివిజన్ పరిది లో జగనన్న ఇళ్ల స్థలాల్లో మొదటి విడత నిర్థేశించిన గృహాలన్నింటినీ గ్రౌండింగ్ పనులు పూర్తి చెయ్యాలన్నారు. ఇప్పటికే అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలను అందించామని, ఇంకా అర్హులై ఉండి ఆయా సచివాలయాల్లో ఇళ్ల స్థలాల కొరకు ధరఖాసుకున్న అర్హులకు భూసేకరణ చేపపట్టి 90 రోజుల్లోఇళ్ల స్థలాలను అందించాలని ఆర్డీవో అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం స్పందనలో వచ్చిన అర్జీలను నిర్థేశించిన గడువులోపు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలకు సంబందించి కోర్టు కేసులు ఏమైనా వుంటే కౌంటరు దాఖలు చేసి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇంకా ఇళ్ల స్థలాల్లో మెరక పనులు పూర్తి కాకుండా ఉన్నట్లయితే ఎన్ఆర్ఇజిఎస్ ద్వారా మెరక పనులు పూర్తి చేయించాలన్నారు. మండల స్థాయిలో ఏ ఒక్క అంశానికి సంబందించి పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆర్డీవో తాహశీల్థార్లుకు సూచించారు. డివిజన్ పరిధిలో జగనన్నశాశ్విత భూహక్కు భూరక్ష పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పామర్రు, గుడ్లవల్లేరు మండలాల్లో 50 గ్రామాల్లో రీ సర్వే పనులకు ఎంపిక చేసి పనులు చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ సహాయంతో రీసర్వే చేపట్టామన్నారు.
ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి :- ఆర్డీవో ఖాజావలి
కోవిడ్ నియంత్రణే లక్ష్యంగా ప్రభత్వం నిర్థేశించిన లక్ష్యాల ప్రకారం వాలెంటీర్లు, ఆశా ర్కర్, ఎఎన్ఎమ్, వైద్యసిబ్బంది ప్రతివారం పక్కాగా ఫీవర్ సర్వే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు అందేశించారు. ముఖ్యంగా పాఠశాల్లో విద్యార్థులు కోవిడ్ భారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగం, బౌతిక దూరం పాటించడం వంటివి ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కచ్చితంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అమలు చేస్తూ విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించే విధంగా అధికారులు చర్యలుచేపట్టాలన్నారు.
గుడివాడ పట్టణంలో 22 వ వార్డు సచివాలయాన్నిపరిశీలించిన ఆర్డీవో ఖాజావలి
ఆర్డీవో ఖాజావలి స్థానిక మున్సిపల్ అధికారలుతో కలసి పట్టణఁలో ని 22 వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టి, రికార్డులు నిర్వహణ, బయోమెట్రిక్ విదానం వంటి పలు అంశాలను పరిశీలించారు. ప్రభుత్వం పథకాల వివరాలు, లబ్దిదారుల అర్హతలు, ప్రయోజనం పొందిన లబ్దిదారుల వివరాలు ప్రజలకు తెలిసే విదంగా బోర్డులను ప్రదర్శించాలని సచివాలయ ఉద్యోగులకు సూచంంచారు. ఉద్యోగులు క్రమ శిక్షణతో భాధ్యతా యుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. శాఖ పరంగా నిర్వహిస్తున్న పలు అభివృద్ది సంక్షేమ పథకాలను సకాలంలో లబ్దిదారులకు చేరువ చెయ్యాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఆర్డవో కార్యాలయపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, తొమ్మిది మండలాల తాహశీల్థార్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News