Breaking News

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రవేటికరణను 3, 4, 5 తరగతులు విలీనం చేసే ప్రక్రియ ఆపాలి… : ఎస్ఎఫ్ఐ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
భారత విద్యార్థి ఫెడరేషన్ – (SFI) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎం.బి విజ్ఞాన కేంద్రంలో చర్చ గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ చర్చ గోష్ఠి కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కృష్ణా – గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణ్ రావు ,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేయడం పట్ల పేద విద్యార్థులకు అన్యాయం జరగడానికి అవకాశం ఉందిని వారు తెలిపారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి పాఠశాలలో 3, 4, 5 తరగతుల ఉన్నత పాఠశాలకు విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించిందని, ఈ విద్యాసంవత్సరం 3,600 మూడు సంవత్సరాలు గాను దాదాపు 18 వేల పాఠశాలలును విలీనం చేయడానికి సిద్ధమైందని. ఇది పూర్తిగా విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకం మనీ అన్నారు. ప్రాథమిక తరగతుల విలీనం చేస్తే ఎక్కువ డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదం ఉందని మరోపక్క కరోనా వలన పాఠశాలలకు దూరమైన విద్యార్థులను తరగతి గదిలో కూర్చోబెట్టి ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం వాటి విలీనంతో తరగతి విద్యార్థులను మరింత దూరం చేసేలా ఉందని 1,2 తరగతుల అంగన్వాడీలు బోధన చేయాలని పేర్కొన్నారని ఇది పూర్తిగా అంగన్వాడీ వ్యవస్థను దాని ఆశయాలను నిర్వీర్యం చేసేటట్లు ఈ నిర్ణయాలు ఉన్నాయని వారు తెలిపారు.

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ చేయడాన్ని మరియు ఎయిడెడ్ విద్యావ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఎయిడెడ్ కలశాలలు ప్రవేటికరణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ విద్యాసంస్థలు సేవా దృక్పథంతో, తమ ఆస్తులు, ఈ విద్యాసంస్థలకు ఇచ్చిన మహనీయుల ఆశయాలును తూట్లు పొడవడం సరికాదని ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న కోట్ల విలువ చేసే వేలాది ఎకరాల భూములు కాజేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందని అన్నారు. ఇప్పటికే ప్రత్యేక పోరాటం చేస్తూనే, కోర్టుల ద్వారా న్యాయ పోరాటాలు నిర్వహిస్తోందని వారన్నారు.ఎయిడెడ్ విద్యాసంస్థల దాతల సహకారంతో స్థాపించబడిన విద్యాసంస్థలు ఎంతో మంది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాయిని, చరిత్ర కలిగినటువంటి విద్యాసంస్థలు ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.3,4,5 తరగతులు విలీనం చేసే పాఠశాలలను మరియు జీవో నెంబర్ 77 తీసుకువచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులకు వసతిదీవెన, విద్యదీవెన దూరం చేయడం సరికాదని అన్నారు.

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, ఏపీ.టీ.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, పి.డి.యస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి, కె.వి.పి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్రా.మాల్యాద్రి, అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు, జి.సి.జి.టి.ఏ నాయకులు రాజగోపాల్, జి.సి.టి.ఏ నాయకులు వేణు, (విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షలు, సీనియర్ పాత్రికేయులు,సామాజికవేత్త , విద్యావేత్త ) నిమ్మరాజు. చలపతిరావు, ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు,కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎన్. కోటబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు సి.హెచ్ వెంకటేశ్వరరావు, నగర నాయకులు ఏసుబాబు, ప్రసాద్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *