నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
తన చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక చిన్న గాంధీ బొమ్మ సెంటర్ లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని చూపారన్నారు. ఉచిత విద్యుత్ తో రైతులకు ఆదుకున్నారని, ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం , ఫీజు రీయింబర్సుమెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించారన్నారు. ప్రతీ పేద వాడి హృదయంలో చెరిగిపోని స్థానం సంపాందించుకున్నారన్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో నూజివీడు ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేసారని, ప్రజలకు స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందించారన్నారు. ఆ మహానేత ఆశయాలతో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. నూజివీడు లో 250 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నామని, దీంతో ఈ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలతోపాటు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిని 20 కోట్ల రూపాయలతో ఆధునీకరించి,పేద ప్రజలకు మెరుగైన వైద్య అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. నూజివీడు-విజయవాడ రోడ్డును జాతీయ రహదారి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, కౌన్సిలర్ టౌన్ ప్రెసిడెంట్ శీలం రాము, కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పట్టణ ప్రజలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి అక్కడ అ చిన్నపిల్లలు వార్డును సందర్శించి ప్రసవించిన బాలింతలను రోగులను పరామర్శించి అందుతున్న వైద్యం సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఫ్రూట్స్ అందజేశారు ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్, డాక్టర్లు పాల్గొన్నారు