Breaking News

వీరులపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్

-గురువారం వీరులపాడులో పి హెచ్ సి, సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీల సంఖ్య పెరగాలి

విజయవాడ/వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువ డెలివరీలు జరిగేలా చూడాలని తద్వారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పై భారం తగ్గుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.
గురువారం వీరులపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సచివాలయాన్ని కలెక్టర్ జె.నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడుగడుగునా పరిశీలించి ఆసుపత్రిలో వివిధ వైద్య విభాగాలను చూశారు. లేబర్ రూమ్ (ప్రసవాల గది) పరిశీలించారు. అక్కడే తాళం వేసి ఉన్న పరిశీలనా గదిని తెరిపించి ఎందుకు ఇలా ఖాళీగా అట్టి పెట్టారని ప్రశ్నించారు. రోగులు వచ్చినప్పుడు ప్రాథమికంగా అక్కడ ఉండేందుకు కొన్ని బెడ్స్ వేయాలని సూచించారు. అనంతరం పీ హెచ్ సీ పరిధిలో డెలివరీల సంఖ్యను పరిశీలించి తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పీ హెచ్ సీ లో ప్రసవాల సంఖ్య ఇంకా పెంచవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి వసతులు కల్పిస్తూ ఉంటే ప్రసవాల సంఖ్య ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు.
పిహెచ్ సిలలో ప్రసవాల సంఖ్య పెరిగితే సీహెచ్ సీలపై భారం పడదని ఆయన చెప్పారు. సాధారణ ప్రసవాలు నెలలో కనీసం 10 వీరులపాడు ఆసుపత్రిలో జరిగేలా చూడాలాని ఆదేశించారు. సిబ్బంది బయోమెట్రిక్ హాజరును కచ్చితంగా అమలు చేయాలన్నారు. పీ హెచ్ సీ పరిధిలో కోవిడ్ టెస్టుల నిర్వహణ, యాక్టివ్ కేసుల సంఖ్య, ఓపి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 104, 108 షెడ్యూల్ పై సమీక్షించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 108లో రోగులను తీసుకొని వచ్చే సమయంలో సీరియస్ కేసు గుర్తిస్తే వారికి నిర్వర్తించవలసిన టెస్టులపై సమన్వయం కలిగి ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు గుర్తించిన వెంటనే మెరుగైన వైద్యం అందించాలన్నారు.
అనంతరం వీరులపాడు సచివాలయాన్ని కలెక్టర్ జె.నివాస్ తనిఖీ చేశారు. సచివాలయ పరిధిలో ఫీవర్ సర్వే, కోవిడ్ టెస్టుల నిర్వహణ పై ఆరా తీశారు. రోజువారీ ఫీవర్ సర్వే నివేదికలు వాలంటీర్ల నుంచి కచ్చితంగా సచివాలయాలకు చేరాలన్నారు. సంబంధిత ప్రొఫార్మాలు ఆయన పరిశీలించారు. నిల్ రిపోర్ట్ అయినా అది రికార్డులో నమోదు కావాలన్నారు. సచివాలయానికి ఏవిధమైన సర్వీస్ వచ్చినా నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. ఏ ఒక్క సర్వీసు పెండింగ్ లో ఉంచకుండా నిర్దేశించిన గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్దిదారుల వివరాలు, పథకాల వివరాలు బోర్డులపై ప్రదర్శించిన తీరును కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంపై సమీక్షించిన కలెక్టర్ జె.నివాస్ : మండలంలో జగనన్న ఇళ్లస్థలాల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో ప్రారంభం కావాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి నెలరోజుల్లోపులోనే ప్రభుత్వం చెల్లింపులు చేస్తున్న విషయాన్ని లబ్దిదారులకు అవగాహన పరచాలన్నారు. ఎవరైతే ముందు కట్టుకుంటారో వారికి చెల్లింపు ముందుగానే జరుగుతుందన్నారు. ఇసుక, నాణ్యమైన స్త్రీలు, సిమెంట్ అందజేస్తున్న విషయంపై కూడా లబ్దిదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు.
కలెక్టర్ వెంట తహసీల్దార్ విక్టర్ బాబు, ఎంపిడిఓ రామకృష్ణనాయక్, పంచాయతీరాజ్ ఇఇ అక్కినేని వెంకటేశ్వరరావు, పి హెచ్ సి వైద్యాధికారి డా.మంజుల తదితరులు ఉన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *