Breaking News

కైకలూరునియోజకవర్గ ప్రజల ఆరోగ్య దృష్ట్యా సామాజిక ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ త్వరలో ఏర్పాటు చేస్తాం…

-దాతల సహకారంతో రూ.కోటి రూపాయలుతో ఏర్పాటుచేస్తున్న ఆక్సీజన్ ప్లాంట్ ను పరిశీలించిన కలెక్టరు నివాస్
-ప్రతి వార్డులో రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్న కలెక్టరు జె. నివాస్, ఎమ్మెల్యే డిఎన్ఆర్, ఎంపి శ్రీధర్

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం లో స్థానిక శాసనసభ్యులు కోరిక మేరకు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య దృష్ట్యా డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరగుతుందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. శనివారం కైకలూరు నియోగవర్గ స్థాయి సమీక్షాసమావేశానికి హాజరైన కలెక్టరు జె. నివాస్ స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కైకలూరు సామాజికా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ద్వారా ప్రతి వార్డును సందర్శించి రోగులను పరామర్శించి వారికి అందింస్తున్న వైద్య సేవలు గురించి వైధ్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ లో నిర్మాణం జరుగుతున్న ఆక్సీజన్ ప్లాంట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ సందర్బంగా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను ఆధునీకరిస్తూ మెరుగైన వసతులు సౌకర్యాలను కల్పిస్తుందని, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టరు వైద్యాధికారును ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి అభివృద్ధి పై శాసనసభ్యులు డిఎన్ఆర్ కలెక్టరు కు వివరిస్తూ ఇటీవల కరోనా సమయంలో బ్లాక్ ప్రారంభించి ప్రతి రోజు కరోనా బాధితులకు వైద్యం అందించామన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం పట్టణంలోని ప్రముఖులు మరియు గ్రోవెల్ యాజమాన్యం వారి సౌజన్యంతో కోటి రూపాయలుతో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో త్వరలోనే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కైకలూరు మరియు పరిసర ప్రాంతాల రోగులకు డయాలిసిస్ సౌకర్యం అందుబాటులో లేని కారణంగా భీమవరం, విజయవాడ మరియు ఏలూరు పట్టణాలకు వెళ్ళవలసి వస్తున్న దృష్ట్యా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా కైకలూరు సీహెచ్ సీ కి డయాలిసిస్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వస్తే దాతల సహకారం తో ముందుకు వెళతామని కలెక్టర్ జె. నివాస్ కోరారు. కలెక్టరు జె. నివాస్ వెంటనే స్పందిస్తూ ప్రభుత్వం తరపున డయాలిసిస్ కేంద్రం ఇస్తామని దాతలను మరొక అభివృద్ధి కార్యక్రమంలో వినియోగించుకోమన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గ ప్రజల తరపున కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాతల సహకారంతో మరియు తన సొంత సొమ్మును వెచ్చించి కైకలూరు సీహెచ్ సీ ఆస్పత్రికి సీటీ స్కాన్ సౌకర్యం కల్పిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్బంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఇంచార్జి ఆర్డివో ఖాజావలి, సర్పంచ్ డీఎం. నవరత్నకుమారి,డాక్టర్స్ ఆదిలక్ష్మి, ప్రశాంతి,, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబెర్స్, డీవీఎస్ ఫణికుమార్, నెక్కల శ్యామల, మీగడ వెంకటకృష్ణారావు, ఎంపీపీ అభ్యర్థిలు అడవి కృష్ణ,చందన ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షులు, పంజా రామారావు,భాస్కర వెంకటేశ్వరరావు, నిమ్మల సాయిబాబా, నీలపాల వెంకటేశ్వరరావు, చిట్టూరి బుజ్జి, ఊర శ్రీధర్,మంగినేని రామకృష్, బేతపూడి వెంకటర,, బోయిన రామరాజ, గండికోట ఏసుబాబ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *