Breaking News

వర్షాన్ని పట్టుకోండి- క్యాచ్ ది రెయిన్…

-వర్షపు నీటి ప్రతి బిందువును ఒడిసి పట్టాలి…
-కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా గత మార్చి 22న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జలశక్తి అభియాన్ కింద ప్రారంభించిన క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని నవంబరు 30 వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
మంగళవారం జల జీవన్ మిషన్ పై ఆంధ్రప్రదేశ్ తో సహా 6 దక్షిణాది రాష్ట్రాల జిల్లా కలెక్టర్లు, ఉ న్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నందిగామ నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్, నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన్ కుమార్, డ్వామా పిడి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడిటి మోహనరావు, ఏపియంబపి పిడి రవికుమార్, డిడి గ్రౌండ్ వాటర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ వర్షం ఎక్కడ పడుతుందో ఆ సమయంలో వర్షపు నీటిని వడిసి పట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచార సమయంలో దేశ వ్యాప్తంగా అన్ని నీటి వనరులు జియో ట్యాగింగ్ జరుగుతుందన్నారు. ఇది దేశ వ్యాప్తంగా నీటి వనరుల కోసం పునరుజ్జీవన ప్రయత్నాలను అంచనా వేయడానికి ఆధారం అవుతుందన్నారు. 2030 నాటికి దేశ నీటి డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. వర్షం ఎక్కడ పడినా, ఎప్పుడు పడినా, ఎలా పడినా, ప్రతి వర్షపు చుక్కను పరిరక్షించాలన్నారు. వాన నీటి పరిరక్షణకు ఒక శాస్త్రీయ ప్రణాళికను దేశ వ్యాప్తంగా తయారు చేయడం జరిగిందన్నారు. గ్రామీణాభివృద్ధి, అటవీ, ఏపి ఎంఐపి మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో క్యాచ్ ది రెయిన్ అనే నినాదంతో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం కింద చేపట్టిన పనుల పై సమీక్షించారు. నీటి పరిరక్షణలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్, బండ్ స్లాంటేషన్ ఉద్యాన వనాలు, పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల వద్ద, విత్తనాల బంతులను మైనర్ ఇరిగేషన్ ట్యాంక్లను, సాంప్రదాయ నీటి వనరులను, ఇంకుడు గుంతలను,చెక్ డ్యాంలను, వ్యవసాయ చెరువులను అభివృద్ధి పరచాలన్నారు. వర్షపాతం ఎక్కువగా ఉన్న చోట నీటి వనరుల అభివృద్ధి వేగంగా జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులను వీడియో రూపంలో అప్లోడ్ చేయాలన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *