Breaking News

పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

-వ‌ర్షపు నీరు డ్రెయిన్ లో కలిసేలా చర్యలు చేప‌ట్టండి…
-ఎర్రకట్ట రోడ్ లో బి.టి రోడ్డు అబివృద్దికి అంచనాలు రూపొందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని కేదారేశ్వర పేట, ఎర్రకట్ట, చిట్టినగర్, అంబేద్కర్ రోడ్, భవానీపురం, హెడ్ వాటర్ వర్క్స్ తదితర ప్రాంతాలలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సోమవారం పర్యటించి, అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఎర్రకట్ట ప్రాంతములో చేపట్టిన యు.జి.డి మెయిన్‌ పైపు లైన్ పనులు పూర్తి అయిన నేప‌ధ్యంలో సుమారు 360 మీటర్ల పొడవున 2 మీటర్ల వెడల్పున బి.టి రోడ్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి రోడ్ ప్యాచ్ వర్క్ పనులు సత్వరమే పూర్తి చేయాల‌ని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

చిట్టినగర్ జంక్షన్ నందు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకొనుటకు వెడ్డింగ్ షాప్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవానీపురం, అంబేద్కర్ రోడ్, ఆర్.టి.సి వర్క్ షాపు రోడ్, షాదీ ఖానా రోడ్ తదితర ప్రాంతాలలో క‌మిష‌న‌ర్ ప‌ర్య‌టించారు. ఆర్.టి.సి వర్క్ షాపు రోడ్ అభివృద్దికి 15వ ఆర్ధిక సంఘ నిధులతో అంచనాలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. భవానిపురం ప్రాంతములోని పలు విధులలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించి డంపర్ బీన్స్ వద్ద చెత్త కుప్పలుగా పడియుండుట గమనించి శానిటరీ అధికారులకు పలు సూచనలు చేస్తూ, యుద్ద ప్రాతిపదికన చెత్తనంతటిని తరలించాలి ఆదేశించారు.

కనకదుర్గమ్మ ప్లైవోర్‌ దిగువన హెడ్ వాటర్ వర్క్స్ వద్ద డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదలకు అవరోధంగా ఉన్న సిల్ట్ పూర్తి స్థాయిలో తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని అధికారులకు సూచించారు. అదే విధంగా హెడ్ వాటర్ వర్క్స్ నందు లోతట్టు ప్రాంతములో వర్షపు నీరు నిలిచి యుండకుండా చర్యలు చేపట్టి పైపు లైన్ ద్వారా వర్షపు నీరు డ్రెయిన్ లో కలిసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నారాయణమూర్తి, ఇంజనీరింగ్ మరియు శానిటరీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *