Breaking News

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు 50 శాతం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు 50 శాతం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు.

సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో రూ.100.70 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను గృహ నిర్మాణ శాఖమంత్రివర్యులు శ్రీచెరుకువాడ.శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోగ్యం, వైద్యానికి పెద్ద పీఠ వేస్తోందన్నారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు అభివృద్ధి ని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రాన్నీ రూ.45 వేల కోట్ల అప్పు లతో ఉందన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు అధికార మార్పిడి సమయంలో ఇన్ని వేల కోట్లు అప్పులు చేసిన అందించిన సందర్భం లేదన్నారు. విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరునే అన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా ఉన్న మహిళలు పేరునే సంక్షేమ పథకాలు లబ్ది కలిగించే విషయం తెలిసిందే నన్నారు. రాజకీయంగా , అన్ని పదవుల్లో 50 శాతం పదవులు, ఛైర్మన్ పోస్టులు, స్థానిక సంస్థల్లో మహిళలకె ప్రాధాన్యతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించి ఆదర్శంగా నిలిచారన్నారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతులకు అండగా ఆర్భికెలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్హులైన వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆ దిశలోనే అడుగులు వేస్తున్నామన్నారు.

పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో రూ . 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం ను రాజ్యసభ సభ్యులు పిల్లి .సుభాష్ చంద్రబోస్, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ,రూ.17.50 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ ఆరోగ్య కేంద్రంను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. తొలుత రూ.21.40 లక్షలతో నిర్మించిన రెండు అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్సీ కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గుబ్బల తమ్మయ్య, తహసీల్దార్ వై. దుర్గా కిశోర్, ఎంపిడిఓ ఆర్.విజయరాజ్, పంచాయతీ రాజ్ డీఈ ఆర్. రాంబాబు, ఏ డి ఏ రమేష్, సర్పంచ్ శ్రీమతి మెడపరెడ్డి వెంకటరమణ, ఉప సర్పంచ్ కె. సుబ్బారెడ్డి, పెనుగొండ సర్కిల్ సి ఐ నాగేశ్వరరావు, స్థానిక నాయకులు పెనుమాత్స విశ్వనాథ రాజు, సుంకర సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *