విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్యండ్ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం – 1994లక్ష్యలు తదితర అంశాలపై అవగాహన కలింగించే గోడపత్రికను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు జీవించే హక్కు వుందని వారి రక్షణకు నిర్దేశించిన లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ చట్టాన్ని మొదటి సారి ఉ ల్లంఘించిన వైద్యులు గాని, వైద్యనిపుణులు గాని, ఇతరులకు గాని 3 సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమాన విధించబడుతుందన్నారు. తదుపరి ఉల్లంఘనకు 50 వేల రూపాయల జరిమానాలతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందన్నారు. పుట్టబోయే బిడ్డ గురించి ఏ రూపంలో గాని లింగ నిర్ధారణ వివరాలను వెల్లడించడం నిషేదమన్నారు. లింగ ఎంపిక నిషేధ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒక సారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఎంహెచ్ఓ డా. ఇందుమతి, తహాశీల్దార్ వి. శ్రీనివాస్, ఫ్రాన్సిస్ తంబి, భూమిక ఉమెన్స్ సంస్థ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పి. ఉమాదేవి, కౌన్సినర్ జె. అనుపమ, పిసి ఎన్ డిటి ప్రోగ్రాం ఆఫీసర్ డా.రుక్షణ, డా. అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …